
హైదరాబాద్: టీజీ20 లీగ్ 2026లో పాలమూరు స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాలమూరు 19.1 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది.
ఈ లక్ష్యాన్ని రంగారెడ్డి 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ అరవెల్లి అవనీశ్ రావు (50; 32 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకం బాదాడు. మరో ఓపెనర్ జ్ఞాన ప్రకాశ్ రెడ్డి (47; 27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ జోడీ తొలి వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. పాలమూరు బౌలర్లలో రిషభ్ బాస్లాస్ 2, పృథ్వీ రెడ్డి, రతన్ తేజ ఒక్కో వికెట్ పడగొట్టారు. నాలుగు మ్యాచ్‌ల్లో రంగారెడ్డికి ఇది మూడో విజయం కాగా.. అన్నే మ్యాచ్‌లు ఆడిన పాలమూరు మూడో ఓటమి చవిచూసింది.
రంగారెడ్డి రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్ 19.1 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ విఘ్నేశ్ రెడ్డి (46; 46 బంతుల్లో) టాప్ స్కోరర్. షాదాబ్ అహ్మద్ (22), ప్రతీక్ పవార్ (14), బుద్ధి తేజ (15) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. రంగారెడ్డి బౌలర్లలో ఆర్యన్ కరియప్ప 4, పున్నయ్య 2, తనయ్ త్యాగరాజన్ 2, నానావత్ రాకేశ్ 2 వికెట్లు తీశారు.
రంగారెడ్డితో జరుగుతున్న మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్ తొమ్మిది వికెట్లు కోల్పోయింది. పున్నయ్య వేసిన 17.1 ఓవర్‌కు రిషభ్ బాస్లాస్ (8).. త్యాగరాజన్‌కు చిక్కాడు. తర్వాత కరియప్ప బౌలింగ్‌లో (18.1 ఓవర్) రతన్ తేజ (15) రాకేశ్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో పాలమూరు 124 రన్స్ వద్ద తొమ్మిదో వికెట్ నష్టపోయింది.
టీజీ20 లీగ్‌లో భాగంగా పాలమూరు స్ట్రైకర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్ బౌలర్లు చెలరేగుతున్నారు. ఆర్యన్ కరియప్ప 15 ఓవర్లో వరుస బంతుల్లో ప్రతీక్ పవార్ (14), మహ్మద్ అఫ్రిది (0)ని పెవిలియన్‌కు పంపాడు. తర్వాతి ఓవర్లోనే తనయ్ త్యాగరాజన్.. విఘ్నేశ్ రెడ్డి (46)ని క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో 98 పరుగులకే పాలమూరు ఏడు వికెట్లు కోల్పోయింది. 16 ఓవర్లు ముగిసేసరికి పాలమూరు స్కోరు 101/7. రిషభ్ బాస్లాస్ (2), బుద్ధి తేజ (2) క్రీజులో ఉన్నారు.
రంగారెడ్డి రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్ తడబడుతోంది. నానావత్ రాకేశ్ వేసిన 10వ ఓవర్లో చివరి బంతికి షాదాబ్ అహ్మద్ (22) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది.
రంగారెడ్డి రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్ మూడో వికెట్ కోల్పోయింది. రోహిత్ రాయుడు (7) ఔటయ్యాడు. కరియప్ప వేసిన 5.4 ఓవర్‌కు త్యాగరాజన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 6 ఓవర్లకు పాలమూరు స్కోరు 31/3. షాదాద్ అహ్మద్ (0), విఘ్నేశ్ రెడ్డి (17) క్రీజులో ఉన్నారు.
టీజీ20 లీగ్ 2026లో భాగంగా రంగారెడ్డి రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాలమూరు కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ చైతన్య గోల్డెన్ డక్ అయ్యాడు. పున్నయ్య బౌలింగ్‌లో చైతన్య.. తనయ్ త్యాగరాజన్‌కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రజ్ఞయ్ రెడ్డి (1)ని త్యాగరాజన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. రెండు ఓవర్లకు పాలమూరు స్కోరు 3/2. విఘ్నేశ్ రెడ్డి (1), రోహిత్ రాయుడు (1) క్రీజులో ఉన్నారు.
టీజీ20 లీగ్ 2026లో భాగంగా మరికాసేపట్లో పాలమూరు స్ట్రైకర్స్, రంగారెడ్డి రైజర్స్ మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా మ్యాచ్ మొదలుకానుంది. టాస్ గెలిచిన రంగారెడ్డి జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన పాలమూరు ఒక విజయం సాధించింది. రంగారెడ్డి 3 మ్యాచ్‌ల్లో రెండింట గెలిచింది.
పాలమూరు స్ట్రైకర్స్ తుది జట్టు: ప్రజ్ఞయ్ రెడ్డి (కెప్టెన్), విఘ్నేశ్ రెడ్డి, చైతన్య రెడ్డి, రోహిత్ రాయుడు, ప్రతీక్ పవార్, షాదాబ్ ఖాన్, అఫ్రిది అహ్మద్, రతన్ తేజ, రిషబ్ బస్లాస్, రవికిరణ్, అజారుద్దీన్.
రంగారెడ్డి రైజర్స్ తుది జట్టు: తనయ్ త్యాగరాజన్, ఆరోన్ జార్జ్, అవనీశ్ రావు, జ్ఞాన ప్రకాశ్ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితిన్ సాయి యాదవ్, నానావత్ రాకేశ్, అరుణ్ కుమార్, పున్నయ్య, ఆర్యన్ కరియప్ప.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ ‘ఈ’ ఛాంపియన్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మెదక్ ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన మెదక్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 రన్స్‌కే పరిమితమైంది.