
పుణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సియా గోయల్ మేనమామ నరేంద్ర మిట్టల్, అత్త రేణు మిట్టల్ పోలీసుల ఎదుట తమ...
పుణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సియా గోయల్ మేనమామ నరేంద్ర మిట్టల్, అత్త రేణు మిట్టల్ పోలీసుల ఎదుట తమ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కేతన్, సియా కుటుంబాలను పరిచయం చేసి, వారి పెళ్లి సంబంధం కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన మేనమామ నరేంద్ర మిట్టల్.. తన మేనకోడలిపై వచ్చిన ఆరోపణలు విని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సియా చిన్నప్పటి నుంచి తమకు తెలుసని, ఆమె ఇంతటి ఘోరానికి పాల్పడిందంటే నమ్మలేకపోతున్నామని ఆయన పోలీసులకు తెలిపారు. "సియా, కేతన్ ఇద్దరూ చాలా మంచివారు, ప్రశాంత స్వభావం కలవారు. సియా ఇలా చేస్తుందని మేము కలలో కూడా ఊహించలేదు" అని నరేంద్ర మిట్టల్ విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. తమ పాత్ర కేవలం రెండు కుటుంబాలను కలపడానికే పరిమితమని నరేంద్ర మిట్టల్, రేణు మిట్టల్ దంపతులు స్పష్టం చేశారు.జూన్ 18న లోహగడ్ కోట వద్ద ట్రెకింగ్‌కు వెళ్లిన కేతన్ అగర్వాల్, 400 అడుగుల లోయలో పడి మరణించిన విషయం తెలిసిందే. తొలుత ప్రమాదంగా భావించినా, కేతన్ కుటుంబ సభ్యులు సియా ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు హత్య కోణంలో దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో సియాకు చేతన్ చౌదరి అనే వ్యక్తితో సంబంధం ఉందని, కేతన్‌తో పెళ్లికి అది అడ్డంకిగా మారిందని తేలింది. ట్రెకింగ్ సమయంలో సియా సైగ చేయగానే, చేతన్.. కేతన్‌ను లోయలోకి తోసేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులను బాధపెట్టి పెళ్లి