
చెన్నై: తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) నూతన అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు మాణిక్యం ఠాగూర్(51) నియమితులయ్యారు. ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న కె.
Jun 27 2026 6:52 PM | Updated on Jun 27 2026 7:03 PM
చెన్నై: తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) నూతన అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు మాణిక్యం ఠాగూర్(51) నియమితులయ్యారు. ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న కె. సెల్వపెరుంతగై తనను టీఎన్‌సీసీ బాధ్యతల నుంచి తప్పించాలని కోరడంతో పార్టీ అధిష్టానం మాణికం ఠాగూర్‌ను కొత్త అధ్యక్షుడిగా నియమించింది. ప్రస్తుతం ఆయన విరుధునగర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తమిళనాడులో డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ వైదొలగిన నేపథ్యంలో మాణికం ఠాగూర్ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన జాతీయ స్థాయిలోనూ పలు రకాల బాధ్యతలను నిర్వర్తించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయనను టీఎన్‌సీసీ నూతన అధ్యక్షుడిగా నియమించడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.
విద్యార్థి దశ నుంచే రాజకీయాలు 1975 జూన్ 1న శివగంగైలో జన్మించిన మాణికం ఠాగోర్, బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి బీఏ-ఎల్ఎల్బీ పట్టా పొందారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉన్న ఆయన, 1994లో NSUI జిల్లా ప్రధాన కార్యదర్శిగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు.
తర్వాత 1996లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1997లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 1999లో జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎదిగారు. 2003 నుంచి 2005 వరకు ఇండియన్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన, 2006లో కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్‌గా, 2008లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎన్నికల కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.
2009లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. పార్లమెంట్ పలు స్థాయి సంఘాల్లో సభ్యుడిగా ఉన్నారు. 2013 నుంచి 2016 వరకు పార్టీ తరపున పలు రాష్ట్రాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2017 నుంచి దాదాపు మూడేళ్ల పాటు ఏఐసీసీ కార్యదర్శి హోదాలో కర్ణాటక కాంగ్రెస్ ఇంచార్జిగా వ్యవహరించారు. 2019లో రెండోసారి ఎంపీగా గెలిచారు. 2020 నుంచి దాదాపు మూడేళ్ల పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు.
చదవండి: 'బ్రాండ్ మోదీ'పై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె సంచలన వ్యాఖ్యలు
నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు)
భాగ్యరాజ్‌కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)
తెరపై నవ్వు.. తెర వెనుక విజన్.. భాగ్యరాజ్ అరుదైన (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ (ఫొటోలు)
తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం (ఫొటోలు)
వాడి గురించి మాట్లాడటం కూడా వెస్ట్.. మహాసేన రాజేష్ కి కౌంటర్
సూసైడ్ కాదు.. హత్య..! లైవ్ లో బయటపెట్టిన అక్కాచెల్లెళ్లు
సోమవారం హైకోర్టు కీలక తీర్పు..లాకప్ డెత్ కేసులో మరో పిటిషన్..
ఇదే గుర్తుపెట్టుకోండి.. బండరాయితో YSRCPపై దాడి శైలజానాథ్ సీరియస్ వార్నింగ్
కారుపై రాళ్లతో దాడి చేసిన టీడీపీ గూండాలు.. టెన్షన్ టెన్షన్