
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Siya goyal brother on ketan Agarwal murder case: పూణె లోని లోహగఢ్ కోట వద్ద చేతన్ అగర్వాల్ ను కాబోయే భార్య సియా అత్యంత దారుణంగా లోయలోకి తోసి హత్య చేసింది. ఆ తర్వాత కాలు జారీ లోయలో పడిపోయినట్లు కొత్త నాటకంను రక్తి కట్టించింది. ఈ క్రమంలో దీనిపై కేతన్ సోదరికి వచ్చిన అనుమాంతో ఈ ఘటనలో పెద్ద స్కెచ్ వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా సియా కదలికలు, చెప్తున్న మాటలకు పొంతన లేక పొవడంను కేతన్ సోదరి గ్రహించింది.వెంటనే తన తండ్రికి చెప్పడంతో ఈ ఘటనలో అనేక షాకింగ్ ఘటనలు వెలుగులోకి వచ్చాయి.ప్రస్తుతం పోలీసులు సియా గోయల్ ను, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈక్రమంలో సియా సోదరుడ్ని పోలీసులు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.
దాదాపు 10 గంటల పాటు పోలీసులు సియా సోదరుడు సాహిల్ గోయల్ ను విచారించారు. సియా, కేతన్ ల పెళ్లి నవంబర్ లో చేయాలని అనుకున్నామని చెప్పాడు. తమ సోదరికి ఒక వేళ నచ్చకుంటే చెప్పితే ఇంత విషాదం జరక్కపోయేదని చెప్పాడు. తమ కుటుంబం నుంచి పెళ్లికి ఒత్తిడిలేదన్నారు. మరోవైపు చేతన్ చౌదరీ తనతో క్రికెట్ ఆడేవాడని చెప్పాడు.
తన సోదరి క్రికెట్ మ్యాచ్‌లకు హాజరయ్యేదని, అక్కడే అతను చౌదరిని మొదటిసారి కలిసిందని సాహిల్ గోయల్ పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత, గత సంవత్సరం ఇద్దరికి మధ్యస్థంగా ఉండే ఒక స్నేహితుడు ఇచ్చిన దీపావళి పార్టీలో వారు మళ్లీ కలుసుకున్నారని, అప్పటి నుంచి వారిద్దరూ మరింత క్లోజ్ అయ్యారని పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి ఇద్దరు తరచుగా కాల్స్ చేసుకునే వారని చెప్పాడు.
మరోవైపు సియా తల్లిదండ్రులు మాత్రం తమకు చేతన్ చౌదరీ తెలియదని, అతని ముఖం కూడా ఎప్పుడు చూడలేదని చెప్పాడు. పెళ్లికి తమ నుంచి ఒత్తిడిలేదని, సియాను అడిగిన తర్వాత ఈ పెళ్లి నిశ్చయించామని చెప్పాడు. ఈ క్రమంలో సియా సోదరుడు చేత న్ ను తమకు ముందే తెలుసని చెప్పడంతో ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
పోలీసులు విచారణలో ఇప్పటికే జనవరి నుండి వారు 2,000కు పైగా ఫోన్ సంభాషణలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ కాల్స్ మొత్తం వ్యవధి సుమారు 238 గంటలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మే 31న, జూన్ 4న మరల, జూన్ 14న మూడు సార్లు లోహగఢ్ కొండపై చేతన్ ను సియా తీసుకెళ్లిందని, జూన్ 14న కూడా లోయలోకి తోసేయగా అతను ఒక చెట్టును పట్టుకొవడంతో ప్రమాదం నుంచి బైటపడ్డాడు. అప్పుడు ఒక పాము కన్పించిందని చెప్పి అతడ్ని డైవర్ట్ చేసింది.
ఆ తర్వాత పక్కా ప్లాన్ తో చేతన్ చౌదరీ, సియా గోయల్ లు జూన్ 18న లోహగఢ్ హత్యను అమలుచేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ప్రస్తుతం పోలీసులు విచారణలో ఇద్దరు ఒకరిపై మరోకరు నేరాన్ని తోసుకొవడం చేస్తున్నారు.
Read more: Video Viral: ఎంత పనిచేశావ్ సియా..?.. ఫుల్ సెక్యురిటీల మధ్య కొత్త జంట ప్రీవెడ్డింగ్ షూట్.. ఫన్నీ వీడియో వైరల్..
అసలు కేతన్ ను సియా లోయలోకి తోసిందని చేతన్ చెప్తుండగా.. సియా మాత్రం తాను పక్కన ఉన్నానని చేతన్ చౌదరీ కేతన్ ను లోయలోకి తోశాడని చెప్తుంది. ఈ క్రమంలో పోలీసులు మరోసారి సియా తల్లిదండ్రులకు, సోదరుడికి విచారణకు రావాలని సమన్లు జారీ చేయడం ఈ కేసులో ఆసక్తికరంగామారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.