
పుణెకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా, క్రికెట్ కోణం వెలుగులోకి వచ్చింది. కేతన్ హత్య కేసులో నింది
తులైన సియా గోయల్, చేతన్ చౌదరీల మధ్య ప్రేమ చిగురించడానికి కారణం క్రికెట్ అని తెలుస్తోంది.
ముంబై, జూన్ 27: పుణెకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా, క్రికెట్ కోణం వెలుగులోకి వచ్చింది. కేతన్ హత్య కేసులో నిందితులైన సియా గోయల్, చేతన్ చౌదరీల మధ్య ప్రేమ చిగురించడానికి కారణం క్రికెట్ అని తెలుస్తోంది. సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్‌ను పోలీసులు 10 గంటలకుపైగా విచారించారు. విచారణ సందర్భంగా గోయల్ పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టినట్లు సమాచారం. ఆ వివరాల ప్రకారం..
సాహిల్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడేవాడు. క్రికెట్ మ్యాచ్‌లు చూడ్డానికి సియా తరచూ వెళుతుండేది. ఈ నేపథ్యంలోనే చేతన్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఓ సారి కామన్ ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన దివాళీ పార్టీలోనూ ఇద్దరూ కలిశారు. దీంతో ఇద్దరి మధ్యా స్నేహం బలపడి ప్రేమగా మారింది. సియా, చేతన్ ప్రేమించుకుంటున్న సంగతి సాహిల్‌కు తెలుసు. కేతన్‌తో సంబంధం మాట్లాడుతున్నపుడు సియా అభ్యంతరం వ్యక్తం చేస్తుందని సాహిల్ అనుకున్నాడు. కానీ, సియా అలా చేయలేదు. కేతన్ అంటే ఇష్టం లేనట్లు ఆమె అస్సలు ప్రవర్తించలేదు.
కేతన్‌తో పెళ్లి కుదిరిన తర్వాత సియా.. చేతన్‌తో మాట్లాడటం కానీ, తిరగటం కానీ, సాహిల్ చూడలేదు. ఇవే విషయాలు సాహిల్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు సియా, చేతన్ల కాల్ రికార్డ్స్ పరిశీలించగా.. జనవరి నెల నుంచి మర్డర్ జరిగిన తేదీ వరకు ఇద్దరూ 2 వేలకుపైగా ఫోన్ కాల్స్ చేసుకున్నట్లు గుర్తించారు. దాదాపు 238 గంటల పాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు. అయితే, సియా లాయర్ మాత్రం సియా, చేతన్‌లు స్నేహితులు మాత్రమేనని అంటున్నాడు.
ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ మృతిపై పవన్ కల్యాణ్ సంతాపం
అందరికీ సంపూర్ణ ఆరోగ్యం కోసమే సంజీవని పథకం: సీఎం చంద్రబాబు