
Luka Majcen | ఇంటర్నెట్ డెస్క్: స్లోవేనియా ఫుట్బాల్ ఆటగాడు లుకా మిట్సెన్ తన ఆటతో మైదానంలోని అభిమానులను హోరెత్తిస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే.. అతడిలో మరో కోణమూ దాగుంది.
పరమశివుడిపై భక్తితో.. శివుడి రూపాన్ని, మహామృత్యుంజయ మంత్రాన్ని తన వీపుపై టాటూగా వేయించుకున్నాడు. దీని వెనక ఉన్న కారణాన్ని అతడు పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించాడు.
‘‘శాంతారామ్ (Shantaram) అనే ప్రసిద్ధ నవల చదివిన తర్వాత భారతీయ ఆధ్యాత్మికతపై విశ్వాసం కలిగింది. మొదట ఆసక్తిగా మొదలైన ఈ ప్రయాణం నా జీవితాన్నే మార్చేసింది. నా సహచర ఆటగాడి తల్లి నన్ను చూసి రుద్ర అనే పేరు తన మదిలో మెదిలిందని చెప్పింది. అయితే ఆ పేరుకు అర్థం తెలుసుకోవాలని గూగుల్లో వెతకగా.. శివుడి ఉగ్ర రూపాల్లో రుద్రుడు ఒకరని తెలిసింది. శివుడి రూపాన్ని, మహామృత్యుంజయ మంత్రాన్ని ఫ్యాషన్ కోసం టాటూగా వేయించుకోలేదు. భారత్లో గడిపిన సమయంలో నాలో ఏర్పడిన ఆధ్యాత్మిక భావానికి ప్రతీకగా వేయించుకున్నా. భారత్లో ఫుట్బాల్ ఆడేందుకు వచ్చిన నన్ను ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు పూర్తిగా మార్చేశాయి’’ అని తన మనసులోని మాటలను మిట్సెన్ వ్యక్తం చేశాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.