
నల్గొండ పట్టణంలో సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. ఈ ఘాతుకానికి పాల్పడింది మృతురాలి సమీప బంధువులేనని పోలీసులు నిర్ధారించారు.
మృతురాలు హసీనా మేనకోడలు, ఆమె భర్త సహా మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు సయ్యద్ అస్లాం (28), అతని భార్య తబస్సుమ్ (28), స్నేహితుడు మహమ్మద్ సోహైల్ (26)తో పాటు నగల వ్యాపారి హేమంత్ కుమార్‌ను (28) పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీలు, పాత కక్షలే ఈ హత్యలకు కారణమని తేలింది. గతంలో హసీనా వద్ద ఆమె మేనకోడలు తబస్సుమ్, అల్లుడు అస్లాం అప్పు తీసుకున్నారు. ఇటీవల మరోసారి డబ్బు అడగగా ఆమె నిరాకరించడంతో, వారిపై కక్ష పెంచుకున్నారు. ప్రధాన నిందితుడు అస్లాం, యూట్యూబ్‌లో నేరాలకు సంబంధించిన వీడియోలు చూసి ఈ సామూహిక హత్యలకు పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు.జూన్ 19-20 మధ్య రాత్రి అస్లాం సదరు ఇంట్లోకి చొరబడి మొదట హసీనాను హత్య చేశాడు. ఆ తర్వాత అరుపులు విని బయటకు వచ్చిన ఆమె భర్త సుల్తాన్, కుమారుడు ముజమ్మిల్‌ను కూడా మట్టుబెట్టాడు. చివరగా, ప్రాణభయంతో మంచం కింద దాక్కున్న వారి కుమార్తె అఫ్రాను సైతం కిరాతకంగా చంపేశాడు. అనంతరం ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.జూన్ 22న ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం