
రోడ్ల పక్కన గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నాటిన మొక్కలు వృక్షాలుగా మారి పచ్చదనం పంచుతున్నాయి. గ్రామస్థులకు ఆహ్లాదాన్నిస్తున్నాయి.
ఏపుగా పెరిగిన ఆ చెట్లు విద్యుత్తు తీగలకు అడ్డొస్తున్నాయని, గాలివానలకు కొమ్మలు విరిగి విద్యుత్తు తీగలపై పడితే సరఫరాకు అంతరాయం కలుగుతుందన్న ఉద్దేశంతో విద్యుత్తు శాఖాధికారులు కొమ్మలను నరికేయిస్తున్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట్లో తీగల కింద ఉన్న పదులు సంఖ్యలో చెట్ల తలలను నరికేయగా కన్పించిన చిత్రమిది. ఒకవైపు పెంచుతూ మరోవైపు ఇలా నరకడం బాగాలేదని, స్తంభాలు లేనిచోట మొక్కలు నాటడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని స్థానికులు కోరుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.