
పక్షిగూడులా వింతాకారంలో ఉన్న ఈ పువ్వు పేరు ‘కలికో’. దక్షిణ అమెరికాకు చెందిన ఈ తీగ జాతి మొక్క.. హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిలో రంగారెడ్డి జిల్లా కడ్తాల్ టోల్‌ప్లాజా సమీపంలో కనిపించింది.
నల్లమల ప్రాంతంలో అరుదుగా కనిపించే ఈ మొక్క శాస్త్రీయ నామం అరిస్టోలోచియా లిట్టోరాలిస్/ఎలిగెన్స్. దుస్తులపై వేసే కలికో ప్రింట్ మాదిరే.. తెల్లటి బ్యాక్‌గ్రౌండ్‌లో ముదురు ఎరుపు, ఊదా, గోధుమ రంగు చారలు లేదా మచ్చలు అల్లినట్లు ఉంటాయి. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ‘ఈ పువ్వులు ఘాటైన వాసనను వెదజల్లుతాయి. దానికి ఆకర్షితులై కీటకాలు పువ్వు లోపలికి వెళ్తాయి. అయితే వాటిని ఇదేమీ తినదు. కీటకం లోపలి నుంచి బయటకు వచ్చే క్రమంలో దాని ఒంటికి పరాగరేణువులు అంటుకుంటాయి. అది వెళ్లి మరో పువ్వుపై వాలినపుడు పరాగసంపర్కం జరుగుతుంది’ అని అమ్రాబాద్ టైగర్ రిజర్వు(ఏటీఆర్) బయాలజిస్ట్ రవికాంత్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.