
సమంత తెలుగులో లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటోంది. `మా ఇంటి బంగారం` రిజల్ట్ తో ఆమె ఈ ట్యాగ్‌కి కరెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పొచ్చు. అభిమానులు కూడా అదే పేరుతో పిలుస్తున్నారు.
అయితే సామ్ మాత్రం ఈ విషయంలో స్పష్టంగా ఉంటోంది. లేడీ సూపర్ స్టార్ అంటే నయనతార కదా అని ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇచ్చేసింది. తాను కేవలం సమంత మాత్రమే అని చెప్పి తన గొప్పతనం చాటుకుంది. ఇదిలా ఉంటే సమంత నటించిన `మా ఇంటి బంగారం` మూవీ థియేటర్లో సందడి చేస్తోంది. విజయవంతంగా రన్ అవుతోంది. వీకెండ్ లోనే కాదు, వీక్ డేస్‌లోనూ అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది.
సమంత ప్రధాన పాత్రలో నటించిన `మా ఇంటి బంగారం` మూవీ గత శుక్రవారం విడుదలైంది. నందిని రెడ్డి రూపొందించిన ఈ మూవీకి సామ్ భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్ ప్లే అందించారు. అదే సమయంలో సమంతతో కలిసి ఈ మూవీని నిర్మించారు. ట్రాలాల ప్రొడక్షన్లో ఈ మూవీని నిర్మించిన విషయం తెలిసిందే. ఇందులో గుల్షన్ దేవయ్య, దిగంత్, శ్రీముఖి, గౌతమి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. రెండో వారంలోనూ విజయవంతంగా రన్ అవుతున్న ఈ సినిమా విడుదలై వారం రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు మంచి వసూళ్లని రాబట్టింది.
`మా ఇంటి బంగారం` ఏడు రోజుల్లో సుమారు అరవై కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు దీనికి రూ.59.53కోట్ల కలెక్షన్లు వచ్చాయి. గురువారం దీనికి రూ.2.65కోట్లు రావడం విశేషం. బుధవారంతో పోల్చితే గురువారం వసూళ్లు పెరిగాయి. ఈ రోజు శుక్రవారం మరింతగా పెరిగే అవకాశం ఉంది. శనివారం, ఆదివారం మరోసారి తన సత్తా చాటబోతుంది సమంత. ఈ మూవీ ఈ మూడు రోజులు అదిరిపోయే వసూళ్లని రాబట్టనుంది. దీంతో మొత్తం కలెక్షన్లు రూ.70-80కోట్లకు వెళ్లనుంది. లాంగ్ రన్ లో వంద కోట్ల దిశగా వెళ్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి అది సాధ్యమేనా అనేది చూడాలి.
మరి `మా ఇంటి బంగారం` మూవీకి సమంత ఎంత పారితోషికం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఆ విషయాలు తెలిస్తే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. ఈ మూవీకి అయిన బడ్జెట్ రూ.30కోట్లు. థియేటర్లో విడుదలకు ముందే నాన్ థియేట్రికల్‌గా ఈ సినిమాకి సుమారు రూ.33కోట్లు వచ్చాయి. ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్ రూపంలో ఇంతటి భారీ ఇన్కమ్ని అర్జించారు. దీంతో రిలీజ్‌కి ముందే నిర్మాతలు సేఫ్‌లో ఉన్నారు, ఇంకా చెప్పాలంటే ప్రాఫిట్లో ఉన్నారు. ఇక ఇప్పుడు థియేట్రికల్‌గా వచ్చేదంతా భోనస్ అనే చెప్పాలి. ఇప్పటికే ముప్పై కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్ల పర్సెంటేజ్ తీసేస్తే సమంతకి వచ్చిన డబ్బులు సుమారు రూ.25కోట్లు ఉంటాయని చెప్పొచ్చు. అయితే ఈ మూవీకి సమంతకి పారితోషికం ఇవ్వలేదు. సినిమా హిట్ అయితే ఏడు కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తామని మాట్లాడుకున్నారు. ఇప్పుడు పారితోషికం రూపంలో ఆమెకి ఏడు కోట్లు వచ్చింది. అలాగే థియేట్రికల్ రన్ ద్వారా వచ్చింది మొత్తం సమంతకే చెందుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి నిర్మాత తనే. కాబట్టి లాభాలు మొత్తం తనకే చెందుతాయని చెప్పొచ్చు. అలా ఈ ప్రాజెక్ట్ ద్వారా సమంత పొందే లాభాలు ఏకంగా రూ.30-40కోట్ల వరకు ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
నిజానికి `మా ఇంటి బంగారం` మూవీ రిలీజ్‌కి ముందు ఎవరైనా చూస్తారా అనే టెన్షన్లో ఉన్నారు. అటు దర్శకురాలు నందిని రెడ్డి, సమంతతోపాటు అందరి ఫీలింగ్ కూడా అదే. అందుకే సరైన రిలీజ్ టైమ్ కోసం వెయిట్ చేస్తూ వచ్చారు. రెండు మూడు సార్లు వాయిదా కూడా వేశారు. సరైన సమయంలో సినిమాని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆడియెన్స్ ఎగబడి చూస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా చూస్తున్నారు. దీంతో విజయవంతంగా రన్ అవుతుంది. ఊహించని విధంగా కలెక్షన్లు వస్తున్నాయి. వచ్చే వారం కూడా ఈ మూవీకి తిరుగులేదు. మొత్తంగా సమంత లేట్‌గా వచ్చినా, లేటెస్ట్ గా వచ్చింది. కొడితే కుంభస్థలమే కొట్టేసింది.