విక్టరీ వెంకటేష్ నువ్వు నాకు నచ్చామ్ సినిమా గుర్తుంది కదా.. ఆ సినిమాలో ఓ కామెడీ సీన్లో వెంకీ చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది.
'నేను ఐఏఎస్ పాసయ్యాక వైజాగ్ కలెక్టరేట్లో కలెక్టర్ చైర్లో కూర్చుని చంద్రబాబు నాయుడు గారితో కాన్ఫరెన్స్‌లో ఉన్నప్పుడు.. ఎందుకో కిటికీ వైపు చూస్తే మా నాన్న కనిపిస్తాడు. వెంటనే నేను.. చంద్రబాబు బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడని చెప్పేసి.. వెంటనే టీవీ కట్టేసి.. నన్ను క్షమించు నాన్న.. నిన్ను వెయిట్ చేయించానంటూ కాళ్లపై పడతాను' అంటూ వెంకటేష్ చెప్పే సన్నివేశం ఉంటుంది. ఇప్పుడు అదే సీన్‌ను రీ క్రియేట్ చేసి సరదాగా ఓ వీడియోను రూపొందించారు. ఈ వీడియో ఫన్నీగా ఉందంటూ ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇదే డైలాగ్‌తో ఆర్నా అనే పాపతో ఆమె తండ్రి ఫన్నీగా ఓ వీడియో ఏఐ ద్వారా రూపొందించారు. ఈ వీడియోలో ఆర్నా పాప ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నట్లుగా నువ్వు నాకు నచ్చావ్ మూమీలో సీన్‌ను రీ క్రియేట్ చేశారు. ఆర్నా పాప వీడియో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశారు. 'ఈ వీడియో చూసి నవ్వకుండా ఉండటం అసాధ్యం.. నేను అఫిషియల్‌గా ఆర్నాకు మద్దతు ఇస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబుకు ఈ వీడియో బాగా నచ్చింది అందుకే ఎక్స్ (ట్విట్టర్లో) అందరితో పంచుకున్నారు. ఈ వీడియోకు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. చంద్రబాబు ఆయనపై వచ్చిన మీమ్‌ను పోస్ట్ చేయడం బావుందని ఓ నెటిజన్ అన్నారు. మరో నెటిజన్ ఇదే డైలాగ్‌తో తన కుమారుడి వెర్షన్లో చేసిన మరో వీడియోను షేర్ చేశారు.చంద్రబాబు ట్వీట్ చేసిన వీడియోలో చిన్నారి ఆర్నా ముందు 'ఆర్నా ఐఏఎస్ – విశాఖపట్నం' పేరుతో నేమ్ ప్లేట్ ఉంది. పాప వెనుక స్క్రీన్‌పై చంద్రబాబుతో వీడియో కాల్లో మాట్లాడుతున్నట్లుగా క్రియేట్ చేశారు. చిన్నారి ఆర్నా చెయ్యి ఊపుతూ 'బై సీబీఎన్ అంకుల్, 'నేనిప్పుడు మీతో మాట్లాడలేను' అంటూ వీడియో కాల్ కట్ చేసి తండ్రి కాళ్లపై పడినట్లుగా రీ క్రియేట్ చేశారు. గతేడాది ఓ నెటిజన్ ఇదే సీన్‌ను ఏఐ ద్వారా వెంకటేష్ చెప్పిన డైలాగ్స్‌తో నిజం చేసి చూపించారు. ఈ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. మళ్లీ ఇప్పుడు కొంతమంది నెటిజన్లు వాళ్ల పిల్లలతో ఏఐ ద్వారా రీ క్రియేట్ చేస్తున్నారు. ఆర్నా పాప వీడియా వైరల్ కావడంతో చంద్రబాబు ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో పాలనాపరమైన అంశాలతో బిజీగా ఉండే చంద్రబాబు ఈ వీడియోనుసరదాగా పోస్ట్ చేయడం విశేషం.