డబ్బులన్నీ రేఖ చేతిలో పెట్టావ్.. నాకు ఇవ్వమంటే మాత్రం అమాయకంగా ఫేస్ పెడతావ్..నా పేమెంట్ సంగతి ఏంటి? అని ఇందుని రాజు నిలదీస్తాడు. దీంతో రాజుకి ఇవ్వాల్సిన పేమెంట్ని పర్సులో పెట్టుకుని వస్తుంది ఇందు.
ఆ డబ్బు తీసి రాజుకి ఇస్తుంది ఇందు. ఆ డబ్బుల్ని లెక్క పెడుతూ ఉంటాడు రాజు. కాస్త అటూ ఇటూ తిరిగితే తక్కువ ఇచ్చిందని కొంత నొక్కేద్దామని రాజు అనుకుంటాడు. కానీ రాజు లెక్క పెడుతుంటే ఇందు కన్నార్పకుండా చూస్తూనే ఉంటుంది. నాకు నీ వేషాలు తెలుసు.. తక్కువ వచ్చాయని చెప్పాలని చూస్తున్నావ్.. నేను మళ్లీ లెక్క పెడతా.. కరెక్ట్ వస్తే.. నువ్వు ఎంత తక్కువ చెప్తే దానికి డబుల్ కట్ చేస్తా అని అంటుంది ఇందు. దీంతో రాజు భయపడతాడు. వద్దులే కరెక్ట్ గానే ఉందని అంటాడు. నువ్వు తింగరి దానివని అనుకున్నా.. కానీ నీకు చాలా తెలివి ఉంది.. సీఈవో అవ్వడానికి అన్ని అర్హతలున్నాయి.. నీకు జాలి, దయ అన్నీ బాగానే ఉన్నాయ్ అని ఇందుని పొగిడేస్తాడు రాజు. ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నావ్.. నీ పేమెంట్ ఇచ్చా కదా అని ఇందు కౌంటర్ వేస్తుంది.మనల్ని పట్టించుకోరు.. డబ్బు వస్తే అది మారిపోతుందని ముందే చెప్పా కదా అని భ్రమరం అంటుంది. అది ఏం చేసినా సైలెంట్‌గా ఉంటున్నాను అంటే వదిలేసినట్టు కాదు అని రేఖ అంటుంది. ఈ రోజు ఆఫీసులో ఆ ఇందు చేసింది చూశావ్ కదా.. అలానే కంటిన్యూ అయితే ఆఫీసులో మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు.. చివరకు ఆఫీస్ బాయ్ కూడా మనకు గుడ్ మార్నింగ్ చెప్పరు అని భూషణ్ అంటాడు. ఇలానే వదిలేస్తే మన గతి ఏంటి? అన్నట్టుగా భ్రమరం అంటుంది. దాన్ని అంత ఈజీగా ఎలా వదిలేస్తాను అని రేఖ అంటుంది.కాంట్రాక్ట్ చెడగొట్టే ప్లాన్.. డబ్బులన్నీ మనకే వస్తాయి.. అన్నావ్.. చివరకు ఐదు లక్షలు వచ్చాయి.. అది కూడా మనకు ముష్టి వేసినట్టుగా వేసింది.. పంచుకుంటే తలా ఒక లక్ష వస్తుందని భ్రమరాంబ అంటుంది. ఇలానే వదిలేస్తే మనకు ఏమీ మిగలదు అని భూషణ్ అంటాడు. అది ఈ రోజు ఆఫీసులో చేసిన దానికి తోక కత్తిరించాలని ఫిక్స్ అయ్యా.. హర్ష కాంట్రాక్ట్ చెడిపోయేలా చేస్తా.. మళ్లీ అది మన కాళ్ల దగ్గరకే వస్తుంది అని రేఖ అంటుంది. అప్పుడు ఆ ఇందు మనం చెప్పినట్టే చేస్తుంది.. డబ్బులు మనకే ఇస్తుంది అంతేనా? అని భూషణ్ సంబర పడుతుంటాడు.శ్రుతికి వివరించిన ఇందు.. ఆఫీసులో శ్రుతికి డిజైన్ ఎలా ఉండాలో వివరించి చెబుతుంది ఇందు. కావ్య మేడం కూడా ఇలానే ప్రతీ చిన్న విషయాన్ని వివరించేవారు.. అని శ్రుతి అంటుంది. మా అమ్మ వేసిన డిజైన్స్ ఎక్కడున్నాయ్ అని ఇందు అడుగుతుంది. మీ క్యాబిన్‌లోనే ఉన్నాయని చెబుతుంది శ్రుతి. ఇక శ్రుతితో ఇందు చెబుతున్న డిజైన్స్, ఇన్ స్ట్రక్షన్స్ అన్నీ కూడా దూరం నుంచి భూషణ్, రేఖ వింటారు. స్పీడ్ చూస్తుంటే డీల్ మొత్తం ఫినిష్ చేసేలానే ఉంది అని భూషణ్ అంటాడు. అది జరగకుండా చూసేందుకు నేను ఉన్నాను కదా అని రేఖ అంటుంది.కావ్య డిజైన్స్‌తో.. కావ్య చేసిన డిజైన్లను ఇందు చూస్తుంది. అమ్మకి గుర్తుగా చేయించినట్టు ఉంటుంది.. ఈ డిజైన్స్ పంపిస్తాను.. ఎలాగూ శ్రుతి కూడా కంప్లీట్ చేసేలా కనిపించడం లేదు అని ఇందు అంటుంది. ఆ డిజైన్లను చూసిన హర్ష ఇవన్నీ పాతవే కదా.. కావ్య వేసినవే కదా.. కొత్తవి కావాలని అంటాడు. సరేనండి అని ఇందు ఫోన్ పెడుతుంది. నువ్వే డిజైన్స్ వేయొచ్చు కదా.. మీ అమ్మలా అని రాజు అంటాడు. అది మన వల్ల కాదు.. అని ఇందు అంటుంది. ఇక నీ ఇష్టం అని రాజు వదిలేస్తాాడు.ఆ పది లక్షలు ఏం చేశావ్.. ఇందుని ఎలా అడ్డుకోవాలా? అని అంతా ఆలోచిస్తుంటారు. మధ్యలో ఐశ్వర్య వచ్చి లక్ష కావాలని అడుగుతుంది. దీంతో అంతా నోరెళ్లబెడతారు. ఇక రేఖ మాత్రం ఐశ్వర్యని పిచ్చి పిచ్చిగా తిడుతుంది. ఆ రోజు కొడదామని అనుకున్నా.. కానీ ఇందు ముందు తక్కువ చేయడం ఇష్టం లేక వదిలేశా.. అయినా ఆ పది లక్షలు ఏం చేశావ్.. అని రేఖ అంటుంది. అవన్నీ ఎందుకు.. ముందు లక్ష ఇవ్వండి అని ఐశ్వర్య అంటుంది. రూపాయి కూడా ఇవ్వను.. బయటకు వెళ్తే కాళ్లు విరగ్గొడతా.. ఇంట్లోనే ఉండు అని ఫైర్ అవుతుంది రేఖ.ప్లాన్ వేసిన రేఖ.. ఇందుని మనం ఆపకపోతే కష్టం అని భ్రమరం అంటుంది. రేపు ఏం జరుగుతుందో మీరెవ్వరూ ఊహించరు అని రేఖ అంటుంది. ఏం ప్లాన్ వేస్తుందో అని శేషు లోలోపల అనుకుంటాడు. ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందా? అని భ్రమరం అంటే.. నాకు ఓటమి అన్నదే లేదు అని రేఖ అంటుంది. ప్రతీ సారి ఓడిపోతూనే ఉంటుంది.. మళ్లీ ఇదొక సెల్ఫ్ డబ్బా.. ఓటమి అన్నదే లేదు అని రేఖ గురించి శేషు అనుకుంటాడు. ఇక రేఖ తన ప్లాన్ గురించి ఇంట్లో ఎవ్వరికీ చెప్పదు.ఇందులో కాన్ఫిడెన్స్ పెంచిన రాజు.. చూస్తుంటే శ్రుతి డిజైన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు.. ఏం చేద్దాం అని ఇందు కంగారు పడుతుంటుంది. నేను ఆల్రెడీ నీకు ప్లాన్ ఇచ్చా కదా.. మనం డిజైన్స్ చేద్దాం.. ప్రయత్నం చేయాలి కదా.. ప్రయత్నం చేయకుండానే ఓడిపోయినట్టు ఒప్పుకుంటే ఎలా.. రచయిత.. ఏం రాస్తాం లే అని వదిలేస్తే.. రచయిత అవుతాడా? మనం కూడా ట్రై చేద్దాం.. మీ అమ్మ చేసింది కదా.. మనం కూడా ట్రై చేద్దాం.. వేస్ట్ అయితే.. కాగితం, పెన్ను, పెన్సిలే కదా.. అని రాజు ధైర్యం చెబుతాడు. ఇందులో కాన్ఫిడెన్స్ పెంచేలా మాట్లాడతాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. 🔹‘పొదరిల్లు’ టుడే ఎపిసోడ్ : ప్రేమను వ్యక్త పర్చిన శైలు.. సందిగ్ధంలో కేశవ.. మహా కోసం తపిస్తున్న చక్రి