
మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆహ్వానిస్తున్న బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు ఈనాడు, హైదరాబాద్: బీసీ గురుకుల విద్యాలయాల నుంచి ప్రఖ్యాత విద్యా సంస్థలైన ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీలకు ఎంపికైన...
మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆహ్వానిస్తున్న బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు
ఈనాడు, హైదరాబాద్: బీసీ గురుకుల విద్యాలయాల నుంచి ప్రఖ్యాత విద్యా సంస్థలైన ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీలకు ఎంపికైన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురుకుల సొసైటీ వ్యవసాయ కళాశాలలో బీసీ గురుకుల విద్యార్థులకు ప్రవేశాలు ఉంటాయని స్పష్టంచేశారు. మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల సొసైటీని ఇకపై తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ మహాత్మా జ్యోతిరావు ఫులే విద్యాసంస్థల సొసైటీగా మార్చేందుకు బీసీ గురుకుల సొసైటీ బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. గురువారమిక్కడ బీసీ గురుకుల సొసైటీ 6వ బోర్డు సమావేశం జరిగింది. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి, పాఠశాల, ఉన్నత, ఇంటర్ విద్యాశాఖ తరఫున సైదులు, ఉషారాణి, ఎల్.భీంసింగ్, ఆర్.శ్రీధర్, జి.రమేష్, ఈడబ్ల్యూఐడీసీ చీఫ్ ఇంజినీర్ షఫీ, నవోదయ విద్యాలయ సమితి డిప్యూటీ కమిషనర్ బి.చక్రపాణి, గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 12 సైనిక పాఠశాలల ఏర్పాటుకు సంబంధించి కేంద్రానికి ప్రతిపాదనల స్థితిపై వివరాల నివేదిక తీసుకోవాలని సూచించారు. సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యాంశాలివి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.