
క్యాషియర్ శశిని సన్మానిస్తున్న ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు తిరుపతి (నేరవిభాగం), న్యూస్టుడే: హోటల్ క్యాషియర్ నిజాయతీ పెళ్లింట ఆనందాన్ని తెచ్చింది. బెంగళూరుకు చెంది
న శ్రీభరత్కుమార్, కుటుంబంలో జరిగే వివాహం నిమిత్తం తిరుమలకు వచ్చారు. వివాహ వేడుక తర్వాత బుధవారం కుటుంబంతో కారులో తిరుగు ప్రయాణమైన ఆయన.. తిరుపతి జూపార్కు రోడ్డులోని గరుడాద్రి హోటల్లో భోజనం చేశారు. ఆ సమయంలో రూ.45 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ఆభరణాలు గల హ్యాండ్బ్యాగ్ను అక్కడే మరిచి వెళ్లిపోయారు. బెంగళూరుకు చేరుకున్న తర్వాత బ్యాగ్ కనిపించకపోవడంతో బాధితుడు డయల్ 112కు కాల్ చేశారు. పోలీసులు గరుడాద్రి హోటల్ వద్దకు వెళ్లి విచారించగా క్యాషియర్ శశి హ్యాండ్బ్యాగ్ను వారికి అప్పగించారు. వివాహానికి సంబంధించిన విలువైన నగలు దొరక్కపోయి ఉంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్లమని ఈ సందర్భంగా బాధితుడు తెలిపారు. అనంతరం ఎస్పీ సుబ్బరాయుడు క్యాషియర్ శశిని డీపీవోకు పిలిపించి సత్కరించారు. నిజాయతీ మనిషి సంపాదించే అత్యంత విలువైన ఆస్తిగా పేర్కొన్నారు. అదనపు ఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ ప్రసాద్, సీఐ మద్దయ్యాచారి పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.