
పెట్రోల్, డీజిల్ ఖర్చుల మాడ్యూల్లో ఇతర పనుల బిల్లుల డ్రా 669 పంచాయతీల్లో వెలుగుచూసిన కార్యదర్శులు చేతివాటం సర్పంచుల పదవీకాలం ముగిసేముందు చేసిన పనులే వీటిలో అత్యధికం ఈనాడు, అమరావతి: పంచాయతీల్లో రూ.
కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా వీటిని కొందరు కార్యదర్శులు డ్రా చేసేశారు. వివిధ రకాల ఇతర పనుల బిల్లులను పెట్రోల్, డీజిల్ ఖర్చులో ఎవరికీ అనుమానం రాకుండా చూపించి కథ నడిపించేశారు. 669 పంచాయతీల్లో రూ.20 కోట్లు డ్రా చేశారని ప్రాథమిక పరిశీలనలో వెల్లడైంది. పదవీకాలం ముగిసేముందు సర్పంచులతో కలిసి కొందరు కార్యదర్శులు చేతివాటం ప్రదర్శించారు. అసలు పనులు చేశారా? దొంగ బిల్లులు సృష్టించారా? అనే కోణంలోనూ విచారణకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.