
విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని విద్యుత్‌శాఖ సీఎండీ వరుణ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌ను గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా సబ్ స్టేషన్ పరిధిలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే బెజ్జూరు, పెంచికలపేట సబ్ స్టేషన్లను విభజన చేసి రెండు చోట్ల ఏఈ స్థాయి అధికారులను నియమకానికి చర్యలు తీసుకుంటామని అన్నారు
బెజ్జూరు, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని విద్యుత్‌శాఖ సీఎండీ వరుణ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌ను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్ పరిధిలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే బెజ్జూరు, పెంచికలపేట సబ్ స్టేషన్లను విభజన చేసి రెండు చోట్ల ఏఈ స్థాయి అధికారులను నియమకానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. మారు మూల ప్రాంతాల్లో విద్యుత్ సబ్ స్టేషన్లను ఆర్ఎంఎస్ పరిధిలోకి తీసుకు వస్తామని చెప్పారు. కాగజ్‌నగర్ సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వర్షాలు కురుస్తున్నందున విద్యుత్ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకొని పని చేయాలని సూచించారు. . ఆయన వెంట డీఓబీ నాగరాజు, ఏఈలు అంజల్‌కుమార్; శ్రీకాంత్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): భద్రత నియమాలు పాటిస్తూ విద్యుత్ సమస్యలకు సంబంధించిన పనులు చేపట్టాలని విద్యుత్‌శాఖ సీఎండీ వరుణ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీల్డ్‌లో ప్రమాదాలు జరగకుండా భద్రత నియమాలను పాటిస్తూ పనులు చేపట్టాలన్నారు. కన్నెపల్లి నుంచి దహెగాం మండల కేంద్రానికి నిర్మిస్తున్న 33/11 కేవీ విద్యుత్ లైన్‌కు సంబంధించిన నిర్మాణ పనులు తుదిదశకు వచ్చాయని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. గ్రామాలకు విద్యుత్ సరఫ రాను అంతరాయం లేకుండా అందించాలన్నారు. విద్యుత్ శాఖ సిబ్బందికి పలు సూచ నలు, సలహాలు ఇచ్చారు. సీఎండీ వెంట డీ నాగరాజు, ఏడీఈ ఇర్ఫాన్ అహ్మద్, ఏఈ లు రవీందర్, వెంకటేశ్వర్లు, సీనియర్ లైన్మెన్ మురళీధర్, జనార్ధన్, అంజనేయులు, పురుషోత్తం తదితరులు ఉన్నారు.