
పల్లెల్లో పారిశుధ్యం లోపించి అస్తవ్యస్తంగా మారాయి. వీధు ల్లో ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
చెత్త పేరుకుపో యి, డ్రైనేజీల్లో మురుగు పేరుకుపోయి దోమలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో వ్యాధుల భయంతో ప్రజలు వణికిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. మురుగు కాల్వలల్లో ఆశించిన మేర పారిశుధ్య పనులు చేయక పోవడంతో చెత్తాచెదారం పేరుకుపోతోంది.
సిర్పూరు(టి), జూన్ 25 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లో పారిశుధ్యం లోపించి అస్తవ్యస్తంగా మారాయి. వీధు ల్లో ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. చెత్త పేరుకుపో యి, డ్రైనేజీల్లో మురుగు పేరుకుపోయి దోమలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో వ్యాధుల భయంతో ప్రజలు వణికిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. మురుగు కాల్వలల్లో ఆశించిన మేర పారిశుధ్య పనులు చేయక పోవడంతో చెత్తాచెదారం పేరుకుపోతోంది. దీంతో పలు కాలనీల్లో దుర్గంధం వెదజల్లుతోంది. సిర్పూరు (టి) మేజర్ గ్రామ పంచాయతీ పరిఽధిలో 16 గ్రామ పంచాయతీలు, 27 గ్రామాలుండగా, సిర్పూరు(టి) గ్రామ పంచాయతీలోనే 14 వార్డులున్నాయి. వర్షా కాలం ఆరంభంలో వర్షాలు కురుస్తుండడంతోనే పలు మండలాల్లో కాల్వల్లో నీరు నిలిచి పోతోంది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సిర్పూరు(టి) మండలంలో ప్రధాన వీఽధులతో పాటు అంతర్గత రహదారుల పక్కనున్న డ్రైనేజీల్లో నీరు నిలిచిపోతోంది. పలు రోడ్లపై కూడా మురుగునీరు వస్తోంది. దీంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం ఆరంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మరిన్ని భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందని గ్రామీణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ఆరంభం కాక ముందే ముందస్తు చర్యలు తీసుకుంటే ఇలాంటి సమస్యలు ఉండేవి కావని పలువురు చెబుతున్నారు.
గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు, ఇతర అభివృద్ధి నిధులు వచ్చినప్పటికీ కూడా పారిశుద్య నిర్వహణపై సరైన దృష్టి సారించడం లేదన్న ఆరోపణలున్నాయి. మండలంలో వివిధ గ్రామ పంచాయతీల్లో కేవలం అప్పుడప్పుడు పైపైగా చెత్త తొలగించడం తప్ప డ్రైనేజీలను పూర్తి స్థాయిలో పూడికతీత పనులు చేపట్టడం లేదని ఆ యా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో అంటువ్యాధులు వ్యాపించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం అభివృద్ది పనులపై ఉన్నతాధికారులు దృష్టి సారించి నిధులు కేటాయించాలని, చెత్తాచెదారం ఎప్పటికప్పుడు తొల గించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఈవో తిరుపతిని వివరణ కోరగా వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే పారిశుధ్య పనులు చేపడుతున్నామన్నారు. అలాగే ఫాగింగ్, బ్లీచింగ్ పౌడర్లో శుభ్రం చేసేందుకు కార్యక్రమాలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.