
రానురాను ప్రజలకు బద్దకం అధికం అవుతోంది. కనీసం నాలుగు అడుగులు కూడా వేయలేని పరిస్థితి నెలకొంది. లగ్జరీ, బిజీ లైఫ్ కు అలవాటు పడిన నగరవాసులు కాలు కింద పెట్టకుండానే స్విగ్గీ, జొమాటో, జెప్టో అంటూ ఆర్డర్లు...
రానురాను ప్రజలకు బద్దకం అధికం అవుతోంది. కనీసం నాలుగు అడుగులు కూడా వేయలేని పరిస్థితి నెలకొంది. లగ్జరీ, బిజీ లైఫ్ కు అలవాటు పడిన నగరవాసులు కాలు కింద పెట్టకుండానే స్విగ్గీ, జొమాటో, జెప్టో అంటూ ఆర్డర్లు పెట్టేస్తున్నారు. వాళ్లు ఏకంగా గుమ్మం ముందుకు వచ్చి ఆర్డర్లు ఇచ్చి వెళ్తున్నారు. దాంతో వీళ్ల బద్దకం మరింత పెరుగుతోంది. సిటీల్లోని అనేక బిల్డింగ్స్ లో లిఫ్ట్ సదుపాయం ఉన్నా కిందకు వెళ్లకుండా పైనుంచే బుట్టలు విసిరేసి మరీ కాయకూరలు, ఇతర తినుబండారాలను కొనుగోలు చేస్తుండటం మనం చూస్తుంటాం. అయితే తాజాగా ఓ షాకింగ్ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.అన్నీ కూర్చొన్న చోటుకే రావాలని నేటి ప్రజలు భావిస్తున్నారు. అలా లేజీ లైఫ్ కు అలవాటు పడిపోయారు. ఉదయం లేవాలంటే బద్దకం.. కార్యాలయాలకు వెళ్లాలన్నా బద్దకం.. ఆఖరికి మన పనులను మనం చేసుకోవాలన్నా బద్దకంగా మారుతోంది అనేకమందికి ఈ వైరల్ వీడియోలో ఓ వ్యక్తి ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో నిల్చుని ఉంటాడు. నడుంకు టవల్ చుట్టుకుని ఏదో ఆరాటంలో ఉంటాడు. ఇంతలో రోడ్డు దాటి ఐస్‌క్రీమ్ బండి వ్యక్తి గోడ వద్దకు వస్తాడు. అతని చేతిలో ఐస్ క్రీమ్ ఉంటుంది. అప్పుడు బాల్కనీలో నిల్చున్న వ్యక్తి.. ఇలా గోడ ఎక్కి తనకు ఐస్‌క్రీమ్ ఇవ్వాలని అంటాడు.కస్టమర్ విజ్ఞప్తిని కాదనలేక కింద ఉన్న వ్యక్తి అలాగే చేసేందుకు ప్రయత్నించాడు. చిన్నపాటి గోడ ఉంటే దాన్ని ఎక్కి పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వ్యక్తికి ఐస్‌క్రీమ్ ఇవ్వబోతాడు. ఆ ఐస్ క్రీమ్ ను అందుకునే క్రమంలో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా జారి అమాంతం కిందపడిపోతాడు. దాంతో ఐస్‌క్రీమ్ విక్రయించే వ్యక్తి ఒక్కసారిగా షాక్ అవుతాడు. కిందపడ్డ వ్యక్తి అరుపులతో ఆయన భార్యతోపాటు మరికొందరు బయటకు వచ్చి అతడ్ని చూస్తారు. ఇక కుటుంబసభ్యులు బాధితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ఉత్తర్ ప్రదేశ్ లోని సోన్‌భద్ర జిల్లాలో జరిగిన ఈ షాకింగ్ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.ఐస్‌క్రీమ్ కోసం ఆరాటపడితే ప్రాణాలు పోయేవి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు.. ప్రజలకు ఈ రోజుల్లో బద్దకం పెరిగిపోయిందని ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వ్యక్తి మెట్లు దిగి కిందకి రాలేకపోతున్నాడని ఎద్దేవా చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఈ వీడియోను చూసి నవ్వుకుంటున్నారు.