
వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిక్కు జల తత్వం వాటర్ ఎలిమెంట్ తో ముడిపడి ఉంటుంది. బాత్రూమ్ కూడా నీటితో సంబంధం కలిగి ఉండటం వల్ల రెండు జల శక్తులు ఘర్షణపడి సమస్యలు తలెత్తుతాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిక్కు జల తత్వం వాటర్ ఎలిమెంట్ తో ముడిపడి ఉంటుంది. బాత్‌రూమ్ కూడా నీటితో సంబంధం కలిగి ఉండటం వల్ల రెండు జల శక్తులు ఘర్షణపడి సమస్యలు తలెత్తుతాయి. ఈ వాస్తు దోషం కారణంగా కుటుంబ సభ్యులు తరచుగా అనారోగ్యంతో బాధపడతారు. తలనొప్పి, జీర్ణ సమస్యలు, కిడ్నీ సంబంధిత రోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈశాన్యం మూలలో బాత్ రూమ్ ఉంటే కలిగే నష్టాలివే పిల్లలు మరియు వృద్ధులు ఎక్కువగా ఆనారోగ్యంతో దెబ్బతింటారు. ధనం నిలవకుండా పోవడం, అనవసర ఖర్చులు పెరగడం, వ్యాపారాల్లో నష్టాలు, ఉద్యోగంలో అడ్డంకులు ఎదురవుతాయి. ఆర్థిక వృద్ధి మందగించి, అప్పులు పెరిగే పరిస్థితి ఏర్పడవచ్చు. దీనివలన ఇంట్లో మనశ్శాంతి దెబ్బతింటుంది. కలహాలు, ఒత్తిడి, నిద్రలేమి సాధారణమవుతాయి. పిల్లల చదువులో ఆటంకాలు, నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం, సంబంధాల్లో విభేదాలు ఏర్పడతాయి. ఇంటి నెగిటివిటీ దీనితో ... పరిహారాలు ఇలా కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మిక ప్రగతి కూడా నిరోధించబడుతుంది. ఈ దోషం వల్ల ఇంటి మొత్తం వాతావరణం నెగెటివ్‌గా మారి, అన్ని రంగాల్లో అడ్డంకులు ఎదురవుతాయని అనుభవజ్ఞులు చెబుతున్నారు. అయితే ఈ వాస్తు దోష నివారణకు తీసుకోవాల్సిన నివారణ చర్యలు తప్పక తీసుకోవాలి. పూర్తి స్థాయిలో బాత్‌రూమ్‌ను మార్చడం సాధ్యం కాకపోతే, కొన్ని సులభమైన మరియు ప్రభావవంతమైన పరిహారాలు అనుసరించవచ్చు:సానుకూలత కోసం బాత్ రూమ్ లో ఇది పెట్టండి బాత్‌రూమ్ తలుపు ఎప్పుడూ మూసి ఉంచాలి. టాయిలెట్ సీట్ మూతను కూడా వేసి ఉంచడం చాలా ముఖ్యం. ఇది నెగెటివ్ ఎనర్జీ వ్యాప్తిని నియంత్రిస్తుంది. బాత్‌రూమ్‌లో ఒక చిన్న గిన్నెలో సముద్రపు ఉప్పు లేదా రాళ్ల ఉప్పును ఉంచండి. ప్రతి వారం ఒకసారి మార్చాలి. ఉప్పు ప్రతికూల శక్తులను గ్రహించి శుద్ధి చేస్తుంది. ఇంటికి సానుకూలతను ఇస్తుంది. బాత్ రూమ్ లో ఇలాంటి ఏర్పాట్లతో ఎనర్జీ బ్యాలెన్స్ బాత్‌రూమ్‌లో సరైన వెంటిలేషన్ ఏర్పాటు చేయాలి. సూర్యకాంతి చేరేలా చూడాలి. ఎయిర్ ప్యూరిఫైయింగ్ మొక్కలు పీస్ లిల్లీ, స్నేక్ ప్లాంట్ వంటివి ఉంచడం వల్ల ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది. వాస్తు నిపుణుల సలహాతో వాస్తు పిరమిడ్స్, వాస్తు క్రిస్టల్స్, మిర్రర్స్ లేదా యాంటీ-క్లాక్‌వైజ్ స్వస్తిక్ చిహ్నాలు ఏర్పాటు చేయవచ్చు. ఈశాన్య దిక్కులో పీతాంబర రంగు లేదా తెలుపు రంగు ఉపయోగించడం కూడా మంచిది. ఆగ్నేయ దిక్కులో బాత్ రూమ్ ఉంటే ఏం జరుగుతుంది? తప్పదంటే ఏం చెయ్యాలి?ఇలా చేస్తే వాస్తు దోషం పోతుంది నిత్యం బాత్‌రూమ్‌ను శుభ్రంగా ఉంచడం, ధూపం వేయడం వంటి చర్యలు కూడా సహాయపడతాయి. ఈశాన్య మూలలో బాత్‌రూమ్ ఉండటం వల్ల వాస్తు దోషం ఏర్పడి ఆరోగ్యం, ధనం, మానసిక శాంతి ప్రభావితం అవుతాయి. అయితే సరైన పరిహారాలతో ఈ దోషాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.