
అకస్మాత్తుగా చలి వేయడం, శరీరం వణకడం, అలసటగా అనిపించడం వంటి లక్షణాలను చాలామంది సాధారణంగా తీసుకుంటారు. అయితే ఇవి కొన్ని సందర్భాల్లో హైపోథెర్మియా అనే ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యకు సంకేతాలు కావచ్చని...
అకస్మాత్తుగా చలి వేయడం, శరీరం వణకడం, అలసటగా అనిపించడం వంటి లక్షణాలను చాలామంది సాధారణంగా తీసుకుంటారు. అయితే ఇవి కొన్ని సందర్భాల్లో హైపోథెర్మియా అనే ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యకు సంకేతాలు కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: హైపోథెర్మియా అనేది శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే ప్రమాదకరంగా తగ్గిపోవడం. ఇది ఒక వైద్య అత్యవసర పరిస్థితిగా పరిగణిస్తారు. శరీరం ఉత్పత్తి చేసే వేడి కంటే ఎక్కువ వేగంగా వేడిని కోల్పోయినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గిపోతుంది.
సాధారణంగా శరీర ఉష్ణోగ్రత 98.6°F (37°C) ఉంటుంది. అయితే ఇది 95°F (35°C) కంటే తక్కువకు పడిపోతే దాన్ని హైపోథెర్మియా అంటారు. ఈ పరిస్థితి గుండె, నాడీ వ్యవస్థతో పాటు ఇతర కీలక అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే గుండె వైఫల్యం లేదా ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంది.
మన శరీర ఉష్ణోగ్రతను హార్మోన్లు, శరీర వ్యవస్థలు నియంత్రిస్తాయి. కానీ తీవ్రమైన చలి లేదా ఇతర కారణాల వల్ల శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా సాధారణ స్థాయి కంటే తగ్గిపోతే దానిని హైపోథెర్మియా అంటారు. ఇది ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో ఎక్కువగా కనిపిస్తుంది.
హైపోథెర్మియా ఎవరికైనా రావచ్చు. అయితే ఈ కింది వర్గాల వారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
యాంటీ డిప్రెసెంట్ లేదా యాంటీ సైకోటిక్ మందులు తీసుకునేవారు
బాధితుడిని వెంటనే వెచ్చని ప్రదేశానికి తరలించాలి.
తడి బట్టలు ఉంటే తొలగించి పొడి బట్టలు వేయాలి.
దుప్పట్లు కప్పి శరీరాన్ని వెచ్చగా ఉంచాలి.
వ్యక్తి స్పృహలో ఉంటే గోరువెచ్చని నీరు లేదా సూప్ ఇవ్వవచ్చు.
శరీరాన్ని బలంగా రుద్దకూడదు లేదా మసాజ్ చేయకూడదు.
అకస్మాత్తుగా తీవ్రమైన చలి, వణుకు, అయోమయం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?