
జాతీయ విద్యా విధానంలో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఏడాది కాలపరిమితి గల బీఈడీ వన్-ఇయర్ కోర్సును పునఃప్రారంభించేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఆమోదం తెలిపింది.
వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: జాతీయ విద్యా విధానం (NEP-2020)లో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఏడాది కాలపరిమితి గల బీఈడీ (1-Year B.Ed) కోర్సును పునఃప్రారంభించేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (NCTE) ఆమోదం తెలిపింది. మాస్టర్స్ డిగ్రీ (PG) లేదా నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కోర్సుకు అర్హులు. కాగా, సాధారణ మూడేళ్ల డిగ్రీ చదివిన వారికి ప్రస్తుతం ఉన్న రెండేళ్ల బీఈడీ కోర్సు యథాతథంగా కొనసాగుతుంది.
ఈ నూతన కోర్సుపై అభ్యర్థుల్లో భారీ ఆసక్తి నెలకొనగా.. తెలంగాణలో మాత్రం ప్రస్తుతానికి రెండేళ్ల బీఈడీ అడ్మిషన్ల ప్రక్రియే నడుస్తోంది. ఇటీవలి TG Ed.CET-2026 నోటిఫికేషన్ కూడా 2-Year కోర్సు కోసమే విడుదలైంది. ఈ ఏడాది 1-Year B.Ed అమలుపై తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో1-Year B.Ed కోర్సును రాష్ట్రంలో ఎప్పటి నుంచి ప్రవేశపెట్టాలనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. విద్యాశాఖ ఉన్నతాధికారులు త్వరలోనే దీనిపై సమీక్ష నిర్వహించి, రాష్ట్ర స్థాయి మార్గదర్శకాలను అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు.. మంత్రి సవిత కీలక ప్రకటన
Read Latest AP News And Telangana News And National News