
TGSRTC Retired Employees : టీజీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై ఆర్టీసీ కీలక చర్యలు చేపడుతోంది.
ప్రధానంగా గ్రాట్యుటీ, టీఎల్ఈ (టెర్మినల్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్), ఏఎంబీఎఫ్, ఇతర సెటిల్మెంట్ బకాయిలను త్వరితగతిన విడుదల చేయాల్సిందిగా జిల్లా యూనిట్లకు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీలక ఆదేశాలు చేశారు. మార్చి 2026 వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాల్సిందిగా ఆదేశించారు.
ఉద్యోగులకు రిటైర్మెంట్ అనంతరం అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు (TGSRTC Retired Employees) ఆలస్యం కావడంపై కూడా తీవ్రంగా స్పందించింది ఆర్టీసీ యాజమాన్యం. ఇకపై ఇలాంటి జాప్యాలు జరగొద్దని కూడా హెచ్చరించింది.
రిటైర్డ్ ఉద్యోగుల సెటిల్మెంట్ కేసులను నెల రోజుల్లోగా పూర్తి చేయాలని గడువు కూడా విధించింది. అంతేకాదు.. రిటైర్మెంట్ అయ్యాక రెండు నెలల లోపే అన్ని బకాయిలు విడుదల చేయాలంటూ మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.
Read Also : CM Revanth Reddy : తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు..!
పెండింగ్ కేసుల వివరాలను కూడా వెంటనే హెడ్ ఆఫీస్‌కు పంపాలని జిల్లా మేనేజర్లు, యూనిట్ అధికారులను ఆదేశించింది. ప్రతి కేసు స్థితిని సమీక్షించి, అవసరమైన పత్రాలను త్వరితగతిన సమర్పించాలని సూచించింది. సెటిల్మెంట్ ప్రక్రియలో ఆలస్యం జరిగితే తీవ్రంగా పరిగణిస్తామని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించింది.
రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లింపుపై ప్రత్యేక షెడ్యూల్ రూపొందించి అమలు చేయాలని నిర్ణయించింది. తద్వారా ఉద్యోగుల హక్కుల బకాయిలు వేగంగా విడుదల చేయడం, పారదర్శకత పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం మీద, టీజీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక భద్రతపై ప్రత్యేక దృష్టి కూడా పెట్టింది.