
ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్, నటుడు షణ్ముఖ్ జస్వంత్ ఇటీవలే పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. వైష్ణవి చొడిశెట్టి అనే అమ్మాయితో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు షణ్ణూ.
జూన్ 21న తిరుమల శ్రీవారి సాక్షిగా వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, స్నేహితులు షణ్ముఖ్- వైష్ణవిల వివాహ వేడుకకు హాజరయ్యారు. కొత్త దంపతులను మనసారా ఆశీర్వదించారు. ఇక వైజాగ్ లో తన సొంతింటి వద్ద గ్రాండ్ రిసెప్షన్ కూడా నిర్వహించినట్టు సమాచారం ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు, వీడియోలు ఇంకా సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఉన్నట్లుండి షణ్ముఖ్ జస్వంత్ ఆస్పత్రి పాలయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఆస్పత్రి బెడ్ మీద ఉండి సెలైన్ బాటిల్ ఎక్కించుకున్న ఫొటోను షణ్ణూనే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ఫొటో అయితే షేర్ చేశాడు కానీ అసలు తనకు ఏమయ్యిందో మాత్రం చెప్పలేదు షణ్ముఖ్. దీంతో క్షణాల్లోనే ఈ ఫొటో వైరల్ గా మారింది.
ఈ ఫొటోను చూసిన అభిమానులు కంగారు పడుతున్నారు. షణ్ణూకు ఏమైందోనని ఆరా తీస్తున్నారు. అయితే పెళ్లి, రిసెప్షన్ వేడుకల్లో షణ్ముఖ్ బాగా అలిసిపోయాడని, డీ హైడ్రేట్ అవ్వడం, నీరసించడం జరిగి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. దీనిపై షణ్ముఖ్ క్లారిటీ ఇస్తే కానీ క్లారిటీ రాదు. ఏదేమైనా షణ్ణూ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7) కాగా షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు, ప్రైవేట్ సాంగ్స్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ రియాలిటీ షోలోకి అడుగు పెట్టాడు. తనదైన ఆట, మాట తీరుతో రన్నరప్ గా నిలిచాడు. మధ్యలో వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందుల పడినా మళ్లీ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ అవుతున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇప్పుడు వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్ లోనూ ఒక కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు షణ్ముఖ్.
షణ్ముఖ్ జస్వంత్ - వైష్ణవిల పెళ్లి ఫొటోస్..
A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7) మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.