
ఈటీవీ భారత్: మధ్యప్రదేశ్లో నేలవేము (కాల్మేఘ్) విత్తనాల ధరలు ఏకంగా 10 రెట్లు పెరిగి, రికార్డు స్థాయిలో క్వింటా రూ.6.6 లక్షలకు చేరాయి.
పశ్చిమప్రాంత జిల్లాలైన రత్లాం, మందసౌర్, నీమచ్ జిల్లాల రైతులు ఈ ఔషధ పంటను పెద్దఎత్తున సాగు చేస్తుంటారు. నీమచ్లోని ఔషధ పంటల మార్కెటుకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఈ మార్కెట్లో నేలవేము విత్తనాల ధరలు కొన్ని నెలల క్రితం వరకు క్వింటా రూ.40,000 - రూ.60,000 పలికాయి. తాజాగా ఏర్పడిన భారీ డిమాండుతో ఈ ధర రూ.6.60 లక్షలకు చేరింది. ఆయుర్వేదంలో మధుమేహం వంటి అనారోగ్య సమస్యలకు ఈ ఔషధ మొక్కను వాడుతారు. ఈ ధరల పెరుగుదల ఎంతకాలం కొనసాగుతుందో అంచనా వేయడం కష్టమని స్థానిక కృషివిజ్ఞాన్ కేంద్ర ఉద్యాన నిపుణుడు డాక్టర్ ఆర్.ఎస్.భదౌరియా అభిప్రాయపడ్డారు. అధిక ధరలను చూసి రైతులందరూ ఖరీదైన విత్తనాలు కొని నేలవేము సాగు చేస్తే, వచ్చే ఏడాది విత్తనాల ధర తగ్గితే నష్టపోతారని హెచ్చరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.