
ఈనాడు, దిల్లీ: అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీబీపీ) జాతీయ ప్రతినిధి బృందం బుధవారం ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్‌ను దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసింది.
దేశ నిర్మాణంలో యువత పాత్ర, విద్యార్థుల సంక్షేమం, ఉన్నత విద్యారంగంలో సమకాలీన అంశాల గురించి వారు చర్చించారు. పంజాబ్ యూనివర్సిటీలోని పలు సమస్యలను ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. ఏబీవీపీ నిర్వహిస్తున్న స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్‌స్టేట్ లివింగ్ (ఎస్ఈఐఎల్) కార్యక్రమం 60 ఏళ్లు పూర్తి చేసుకుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. యువతలో డిజిటల్ వ్యసనాన్ని తగ్గించడానికి చేపట్టిన ‘స్క్రీన్ టైమ్ టు యాక్టివిటీ టైమ్’ కార్యక్రమ వివరాలను పంచుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.