
రక్తం తక్కువగా ఉందని టెన్షన్ పడుతున్నారా? రోజూ ఇవి 5ఆకులు తిని చూడండి..!రక్తం తక్కువగా ఉందని టెన్షన్ పడుతున్నారా? రోజూ ఇవి 5ఆకులు తిని చూడండి..!
24 June 2026 Jyothi Gadda ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు తినడం వల్ల జీర్ణ ఎంజైములు ఉత్తేజితమవుతాయి. ఇది ప్రేగుల కదలికలను సులభతరం చేసి మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
గర్భిణీ స్త్రీలకు,లేదా సాధారణంగా ఉదయాన్నే వచ్చే వికారం, వాంతులు అయ్యే భావన వంటి సమస్యలకు కరివేపాకు మంచి విరుగుడు. కరివేపాకు రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల వికారం తక్షణమే తగ్గుతుంది. కరివేపాకు ఒక సహజసిద్ధమైన డీటాక్స్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని పేరుకుపోయిన హానికరమైన టాక్సిన్లను బయటకు పంపుతుంది. తద్వారా మెటబాలిజం మెరుగై, బరువు తగ్గాలనుకునే వారికి మంచిది.
కరివేపాకులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి అత్యంత అవసరమైన పోషకం. ఉదయాన్నే దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రేచీకటి రాకుండా నిరోధించవచ్చు, కంటి చూపు మెరుగుపడుతుంది. కరివేపాకులో ఐరన్, అమైనో ఆమ్లాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలంగా మార్చి, జుట్టు రాలడాన్ని అరికడతాయి. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడే సమస్యను నివారిస్తుంది. ఉదయాన్నే లేచిన వెంటనే తాజా కరివేపాకులను శుభ్రంగా కడిగి నేరుగా నమిలి మింగవచ్చు. నీటిలో వేసి బాగా మరిగించి, ఆ నీటిని వడకట్టి కరివేపాకు టీ లాగా కూడా సేవించవచ్చు. కరివేపాకులో విటమిన్స్ సి, ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బాడీలో ఫ్రీ రాడికల్స్‌ని బ్యాలెన్స్ చేసి ఇమ్యూనిటీని పెంచుతాయి. దీంతో సీజనల్ సమస్యలు అయిన జలుబు, జ్వరం వంటివి రాకుండా కాపాడుకోవచ్చు. కరివేపాకులో ఐరన్, ఫోలిక్ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. వీటి కారణంగా ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి అయి రక్తహీనత సమస్య తగ్గుతుంది. బాడీలో ఐరన్ లోపం తలెత్తకుండా ఉంటుంది. మరిన్ని వెబ్ స్టోరీస్ వారెవ్వా వాల్నట్స్ ..ఇలా తిన్నారంటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు! ఈ దిశలో మందార మొక్కను నాటితే ఐశ్వర్యం మీ వెంటే! బొప్పాయి అమృతమే..కానీ, వీళ్లు తిన్నారంటే కష్టమే!