
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అంబులెన్స్‌కు దారిచ్చి.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
Jun 24 2026 7:43 PM | Updated on Jun 24 2026 8:16 PM
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అంబులెన్స్‌కు దారిచ్చి.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. భూమయ్యగారిపల్లె నుంచి పులివెందుల మార్గమధ్యలో ఘటన జరిగింది. అభిమానులతో మాట్లాడుతున్న సందర్భంలో 108 సైరన్ విన్న వైఎస్ జగన్.. వెంటనే తన కాన్వాయ్‌ని పక్కకు ఆపి అంబులెన్స్‌కు దారిచ్చారు. వైఎస్ జగన్ ఆదేశాలతో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, అభిమానులు రోడ్డు క్లియర్ చేశారు.
పులివెందుల పర్యటనలో వైఎస్ జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా అభిమానులు ఘన స్వాగతం పలికారు. షెడ్యూల్ కంటే ఆలస్యంగా వైఎస్ జగన్ పర్యటన సాగింది. ఉదయం 9 గంటలకు భూమయ్యగారిపల్లె లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ కలశ స్థాపనలో ఆయన పాల్గొన్నారు. అనంతరం భూమయ్యగారిపల్లెలో ఇటీవల మృతిచెందిన మాజీ సర్పంచ్ ఓబులరెడ్డి శ్రీరామిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వైఎస్ జగన్‌తో సెల్ఫీల కోసం అభిమానులు ఉర్రూతలూగారు. ప్రతి ఒక్కరి వద్ద ఆగి సెల్ఫీలు తీసుకున్న వైఎస్ జగన్.. పేరుపేరునా పలకరించారు. 12 గంటలకు పులివెందుల చేరుకోవాల్సిన వైఎస్ జగన్ సాయంత్రం 4.30 గంటలకు చేరుకున్నారు. బాకరాపేటలో ఓ చిన్నారికి ఓనమాలు దిద్దించిన వైఎస్ జగన్ అక్షరాభ్యాసం చేయించారు.
పులివెందులలో రెండో రోజు వైఎస్ జగన్ పర్యటన (ఫొటోలు)
ముద్దుల కూతురితో బిగ్‌బాస్ శివజ్యోతి (ఫొటోలు)
సమంతతో రాహుల్ రవీంద్రన్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
రోజా పువ్వుతో మ్యాడ్ బ్యూటీ పోజులు.. ఫోటోలు
గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో వైఎస్ జగన్
దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్ కేసులో హై కోర్టు కీలక నిర్ణయం
లోకేష్‌ను అడ్డుకున్న గ్రామస్తులు.. ఎందుకంటే ?
జేసీ అనుచరుల కంటే పోలీసులే నీచంగా ప్రవర్తిస్తున్నారు
CI నాగరాజు ఫోన్ ఎక్కడ..? శవాన్ని ఇద్దరూ కలిసే మాయం..!