
ఓటీటీలు వచ్చాక వినోదం మరింత సులభతరం అయిపోయింది. ఏ భాషలో రిలీజైన సరే కంటెంట్ బాగుంటే చాలు డబ్బింగ్ వర్షన్లోనూ తెగ చూసేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా ఓటీటీ ప్రియులు సినిమాలను ఆదరిస్తున్నారు.
Jun 24 2026 7:53 PM | Updated on Jun 24 2026 7:58 PM
ఓటీటీలు వచ్చాక వినోదం మరింత సులభతరం అయిపోయింది. ఏ భాషలో రిలీజైన సరే కంటెంట్ బాగుంటే చాలు డబ్బింగ్ వర్షన్లోనూ తెగ చూసేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా ఓటీటీ ప్రియులు సినిమాలను ఆదరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రతి వారంలో కొత్త సినిమాలు ఓటీటీల్లో ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా ఓ హాలీవుడ్ మిస్టరీ కామెడీ మూవీ సడన్‌గా స్ట్రీమింగ్కు వచ్చేసింది.
ప్రముఖ హాలీవుడ్ స్టార్ స్టార్ హ్యూ జాక్మాన్ ప్రధాన పాత్రలో వచ్చిన మిస్టరీ కామెడీ చిత్రం ‘ది షీప్ డిటెక్టివ్స్’. మే 8న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. తాజాగా ఈ సినిమా జూన్ 24 నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ రచయిత లియోనీ స్వాన్ రాసిన త్రీ బ్యాగ్స్ ఫుల్ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి కైల్ బాల్డా దర్శకత్వం వహించారు.
డెన్బ్రూక్ అనే చిన్న పట్టణంలో గొర్రెల కాపరిగా పనిచేసే హ్యూ జాక్మాన్ అనుకోని పరిస్థితుల్లో హత్యకు గురవుతాడు. అయితే, ఆ హత్య వెనుక ఉన్న అసలు కారణం ఏంటనే కోణంలో కథ ఉండనుంది. దీని కోసం ఆయన మందలోని గొర్రెలే రంగంలోకి దిగడం ఈ చిత్రంలో హైలెట్. గొర్రెలు తమ యజమాని మరణానికి కారణమైన వారిని ఎలా వెతికి పట్టుకున్నాయనేదే ది షీప్ డిటెక్టివ్స్ స్టోరీ. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని ఓటీటీలో చూసేయండి.
ముద్దుల కూతురితో బిగ్‌బాస్ శివజ్యోతి (ఫొటోలు)
సమంతతో రాహుల్ రవీంద్రన్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
రోజా పువ్వుతో మ్యాడ్ బ్యూటీ పోజులు.. ఫోటోలు
గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో వైఎస్ జగన్
కలర్‌ఫుల్ చీరల్లో అందాల అదితీరావ్ (ఫొటోలు)
దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్ కేసులో హై కోర్టు కీలక నిర్ణయం
లోకేష్‌ను అడ్డుకున్న గ్రామస్తులు.. ఎందుకంటే ?
జేసీ అనుచరుల కంటే పోలీసులే నీచంగా ప్రవర్తిస్తున్నారు
CI నాగరాజు ఫోన్ ఎక్కడ..? శవాన్ని ఇద్దరూ కలిసే మాయం..!