
ప్రస్తుతం తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నాయి. సౌత్ చిత్రాల హంగామా దేశవ్యాప్తంగా బలంగా వినిపిస్తోంది. బాహుబలి నుంచి తెలుగు సినిమాలు హిందీ మార్కెట్ లో కూడా సత్తా చాటడం ప్రారంభించాయి.
అయితే బాహుబలి కంటే ముందే పాన్ ఇండియా అప్పీల్ ఉన్న విజువల్ వండర్ చిత్రాలని సౌత్ ఫిలిం మేకర్స్ తెరకెక్కించారు. శంకర్, రాజమౌళి లాంటి దర్శకులు అప్పుడే అద్భుతమైన చిత్రాలు అందించారు. అప్పట్లో వచ్చిన కొన్ని క్రేజీ సినిమాలు ఈ టైంలో రిలీజ్ అయి ఉంటే పక్కాగా 1000 కోట్లు సాధించేవి. ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవలసింది శంకర్ తెరకెక్కించిన రోబో గురించే. అప్పటి వరకు లంచం, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మూవీస్ చేసిన శంకర్ రోబో తో గేరు మార్చారు. ఈ మూవీ యాక్షన్స్ సీన్స్, క్లైమాక్స్ 20 నిమిషాల క్వాలిటీ హాలీవుడ్ రేంజ్ అనే చెప్పాలి.
పీరియాడిక్, లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించారు. టాలీవుడ్ లో ది బెస్ట్ మూవీస్ లిస్ట్ లో ఇది కూడా ఉంటుంది. యోధుడిగా రాంచరణ్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ అద్భుతం అనే చెప్పాలి.
ఇది కూడా రాజమౌళి చిత్రమే. ఈగ చిత్రానికి జక్కన్నకి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. అనేక అంతర్జాతీయ స్టేజీలపై ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. బాహుబలి కంటే ముందు రిలీజ్ అయింది కానీ ఆ తర్వాత రిలీజ్ అయి ఉంటే పక్కాగా ఈ చిత్రం 1000 కోట్ల లిస్ట్ లో చేరిపోయేది. పిల్లలు, పెద్దలు, యువత అందరినీ ఆకట్టుకునే కంటెంట్ ఈ చిత్రంలో ఉంది.
అనుష్క నటించిన ఈ మూవీ లేడీ ఓరియెంటెడ్ చిత్రం అయినప్పటికీ కంటెంట్ పరంగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోదు. జేజమ్మ గా అనుష్క, పశుపతిగా సోనూ సూద్ పోటీపడి నటించారు.
ఈ మూవీ కాన్సెప్ట్, డివోషనల్ టచ్ తో ఉండే ఎలిమెంట్స్, అప్పట్లోనే గ్రాఫిక్స్ ని ప్రజెంట్ చేసిన విధానం అద్భుతం. ప్రేమ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఇప్పుడు ఆమె సినిమాలకు దూరం కావడంతో ఆడియన్ ప్రేమని మరచిపోయారు. కానీ దేవి మూవీ మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆరుంధతితో పాటు దేవి చిత్రాన్ని కూడా కోడి రామకృష్ణ తెరకెక్కించారు.