
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Woman Kisses King Cobra Viral Video Watch Here: సోషల్ మీడియా వరల్డ్‌లో రోజుకో రకమైన వింతలతో పాటు విశేషాలు వెలుగుచూస్తుంటాయి. కొందరు తమ ప్రతిభతో ఆకట్టుకుంటే.. మరికొందరు మాత్రం ప్రాణాలను పణంగా పెట్టి చేసే స్టంట్స్‌తో పాటు సాహసాలతో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తూ ఉంటారు. తాజాగా ఇలాంటి కోవకు చెందిన ఒక వీడియో నెట్టింట విపరీతంగా వైరల్‌గా మారింది.. అందమైన చీరకట్టులో ఉన్న ఒక యువతి.. ఎంతో ప్రమాదకరమైన పాముతో చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చేతిలో కింగ్ కోబ్రా.. సాధారణంగా పాము కనిపిస్తేనే.. ఆమడ దూరం పరుగెత్తే వాళ్లు చాలా మంది ఉంటారు. అలాంటిది ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న యువతి మాత్రం దానికి భిన్నంగా ప్రవర్తించడం మీరు చూడొచ్చు.. అద్భుతమైన పట్టుచీర కట్టుకుని.. సాంప్రదాయబద్ధంగా ఎంతో అందంగా తయారైన ఆ యువతి.. తన చేతుల్లో ఒక పెద్ద, ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను పట్టుకుని కనిపించడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు.. ఆ పామును చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నప్పటికీ.. ఆమె ముఖంలో మాత్రం ఎలాంటి భయం కనిపించకపోవడం గమనార్హం..
ముద్దు పెట్టేందుకు ప్రయత్రించింది.. వీడియోలో అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైందని భావించవచ్చు.. పామును కేవలం పట్టుకోవడమే కాకుండా.. ఆ యువతి దానిని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు.. ఆ విషసర్పం ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియని పరిస్థితిని కూడా మీరు ఇందులో గమనించవచ్చు.. యువతి తన ముఖాన్ని పాము నోటి దగ్గరకు తీసుకెళ్తున్న ప్రతిసారీ.. చూసే సోషల్ మీడియా వినియోగదారులకు గుండె ఆగినంత పనవుతుంది. పాము ఒక్కసారిగా దాడి చేస్తుందేమోననే భయంతో నెటిజన్లు ఊపిరి బిగబట్టి ఈ వీడియోను చూశారు.
ఎట్టకేలకు సక్సెస్.. నెటిజన్లు షాక్.. ఆ యువతి పట్టు వదలకుండా ఎట్టకేలకు ఆ ప్రమాదకరమైన కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టుకోవడం మీరు చూడొచ్చు.. ఆ తర్వాత ఎంతో క్యాజువల్‌గా కెమెరా వైపు చూస్తూ నవ్వింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫారమ్స్‌లో అప్లోడ్ అవ్వడమే ఆలస్యం.. నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అంతేకాకుండా చాలా మంది ఈ వీడియోకు లైక్స్ కూడా చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.