
సాక్షి, గుంటూరు: ఏపీలో పోలీసు వ్యవస్థ చంద్రబాబు జేబు సంస్థగా మారిందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సాయికృష్ణ కేసులో సాక్ష్యాలను మాయం చేశారు.
Jun 24 2026 12:41 PM | Updated on Jun 24 2026 12:52 PM
సాక్షి, గుంటూరు: ఏపీలో పోలీసు వ్యవస్థ చంద్రబాబు జేబు సంస్థగా మారిందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సాయికృష్ణ కేసులో సాక్ష్యాలను మాయం చేశారు. ఏ తప్పు చేయకపోయినా తనను అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. 18 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉంచారు. వచ్చే నెల 29న వినతి పాదయాత్ర చేస్తా అని అంబటి ప్రకటించారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒత్తిడితోనే నాపై కేసులు నమోదు చేశారు. నా ఇంటిపై దాడి చేయడమే కాకుండా నాపై అక్రమంగా రెండు కేసులు పెట్టారు. నన్ను జైలులో ఉంచారు. రెండు కేసుల్లో ఏడేళ్ళ లోపు శిక్ష పడే సెక్షన్లే పెట్టారు. ఈ కేసులో ఇద్దరు సీఐలు, ఒక ఎస్ఐకి హైకోర్టు.. కోర్టు ధిక్కరణ కింద నోటీసులు ఇచ్చింది. వంశీధర్ అనే సీఐ, మధు అనే ఎస్ఐ ఇల్లీగల్‌గా నన్ను లోపలేశారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లుకి హైకోర్టు నోటీస్ ఇచ్చింది. ఈ ముగ్గురు పోలీసులను కేంద్ర మంత్రి పెమ్మసాని పురిగొల్పి నన్ను అరెస్ట్ చేయించారు. డీజీపీ, ఐజీ, ఎస్పీ, డిఎస్పీలకు చెబుతున్నాను. నా ఇంటిపై దాడి చేసిన వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. అందుకే వచ్చే నెల 29వ తేదీన వినతి పాదయాత్ర చేస్తున్నాను.
పోలీస్ వ్యవస్థ చంద్రబాబు జేబు సంస్థగా కొనసాగుతుంది. సాయికృష్ణ అంశంపై మేము పోరాడటానికి కారణం వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయనే. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఏడాది సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారు. ఏడాది నుండి పీఎస్‌లో నేరాలు జరుగుతున్నాయి. ఐజీ రవి ప్రకాష్ ఆధ్వర్యంలోనే సాక్ష్యాధారాలు మాయం చేశారు. సీఐ నాగరాజుతో బేరసారలాడారు. ఏ పోలీస్ పేరు చెప్పవద్దని సీఐ నాగరాజును బతిమలాడారు. ఏ తప్పు చేయకపోయినా నన్ను అరెస్టు చేసి జైలులో వేశారు. కానీ, సీఐ నాగరాజును లాకప్‌లో ఎందుకు వేయలేదు?. పోలీసులు ప్రజలను కాపాడలేరు. సీఎం, హోంమంత్రి విఫలమయ్యారు. పవన్ కల్యాణ్.. నాగరాజును జిందాబాద్ అంటారేంటి?. ఆయనకు సిగ్గు అనిపించడం లేదా?. పవన్ కల్యాణ్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. హోంమంత్రి రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.
కలర్‌ఫుల్ చీరల్లో అందాల అదితీరావ్ (ఫొటోలు)
ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు (ఫొటోలు)
టీజీ20 లీగ్‌లో ఆటగాళ్ల సందడి...స్పెషల్ అట్రాక్షన్‌గా తిలక్ వర్మ (ఫొటోలు)
తిరుమలలో టాలీవుడ్ యంగ్ హీరోహీరోయిన్ (ఫొటోలు)
'పెద్ది' మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్.. చిరు-చరణ్ స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు)
సాయి కృష్ణ కేసులో ట్విస్టులు మీద ట్విస్టులు
పెద్దల ఆదేశాలతో.. సిట్ ప్రశ్నలకు నాగరాజు మౌనం
రాధా గాయత్రి కేసుపై వివరణ ఇచ్చిన శ్రీచరణ్ తండ్రి
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నాగరాజుకు వైద్య పరీక్షలు
టార్గెట్ నల్లపురెడ్డి.. హద్దు దాటిన ప్రశాంతి రెడ్డి..