
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
cost of living in canada: అమెరికా, కెనడా వంటి దేశాల్లో ఆదాయం పెరిగే కొద్దీ అదే స్థాయిలో ఖర్చులు కూడా పెరుగుతాయి. భారతదేశంలో నివసిస్తున్న మనం విదేశాల్లో నివసించేవారు ఎంత సంపాదిస్తారు.. ఎంత ఖర్చు చేశారు.. ఎలాంటి జీవితం గడుపుతారని తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటాము. అయితే కెనడాలో ఒక నెల ఖర్చు ఎంత ఉంటుందో తెలుసా? మన ఇండియాలో ఒక కుటుంబం ఏడాది పొడవునా బతుకుతుంది. ఆ లెక్కలు చూస్తే మీరు షాక్ అవ్వడం పక్కా.
కెనడాలో ఆదాయం ఎంత ఉంటుందో..ఖర్చులు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ఈ విషయం సోషల్ మీడియాలో మరోసారి చర్చకు కారణమైంది. టొరంటో నివాసి ఒకరు తన నెలలవారీ ఖర్చులను పూర్తి వివరాలను ఆన్ లైన్ లో షేర్ చేశారు. కెనడాలోని అతిపెద్ద నగరంలో సాధారణ జీవితం గడిపేందుకు ప్రతినెలా ఎంత డబ్బు అవసరమో ఆ పోస్టు భారతీయ ప్రజలను ఆలోచింపజేసింది. ఆ వ్యక్తి పంచుకున్న ఖర్చులను చూస్తే.. నెలవారీ ఖర్చులు మొత్తం దాదాపు 4,300 డాలర్లు. భారత కరెన్సీలో 2,87,458 రూపాయలు. దీనిలో ఇంటి కిరాయి, కిరాణా సామాగ్రి, రవాణా ఖర్చు, ఫోన్ బిల్లులు, భోజనం, వినోదం వంటి అన్ని నిత్యావసర, లైఫ్ స్టైల్ అంశాలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే నగరాల్లో నివసించాలంటే ఖర్చులు, జీవన వ్యయం ఎలా ఉంటుందో మరోసారి బయటపడింది.
ఖర్చులో పెద్దమొత్తంలో ఇంటి అద్దెకు వెచ్చించాల్సి వస్తుంది. నెలకు సుమారు రూ. 1,67, 127రూపాయలు అద్దె. తర్వాత కిరాణా సామాగ్రికి 43,453. వికెండ్ రెస్టారెంట్లకు వెళ్లాల్సిందే కదా. దానికి 36,767 రూపాయలు. కాఫీకి 16,712 రూపాయలు, ఫోన్ బిల్లులు 10,562. జిమ్ ఖర్చులు 3,275, ఉబెర్ ఈట్స్ కు 4,345, క్లైంబింగ్ వంటి కార్యకలాపాలకు సుమారు 14,840 రూపాయలు ఖర్చు అవుతుంది. కెనడాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఇప్పటికే ప్రధాన సమస్యగా మారింది. నేపథ్యంలో ఈ పోస్ట్ చర్చకు దారి తీసింది. చాలా మంది తమ ఖర్చులను పోల్చుకుంటూ వారి ఆదాయం, లైఫ్ స్టైల్ బట్టి ఆ మొత్తం ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా అని అంచనా వేసుకుంటున్నారు.
ఇంటి అద్దె, కిరాణా సామాను, ట్రాన్స్ పోర్టు, ఫోన్ బిల్లు, ఇతర ఖర్చులు అన్ని కలిపిన తర్వాత మొత్తం ఖర్చు 23,3977కు చేరుకుంది. అంటే మన భారత్ లో నెలసరి 10వేల ఆదాయం ఉన్నవారు ఉన్నారు. కెనడాలో వారి ఖర్చులతో పోల్చితే భారత్ లో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం ఏడాది పాటు హ్యాపీగా జీవించగలుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.