
శరీరానికి కావాల్సిన పోషకాలు అందాలంటే రోజూ 4-5 బాదం పప్పులు, 2-3 జీడిపప్పులు తప్పనిసరిగా తినాలి. రోజూ 5 బాదం, 4 జీడిపప్పులు తింటే ఆరోగ్యంగా, రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
పిల్లల ఆరోగ్యానికి కూడా రోజుకు 4-5 బాదం, 2-3 జీడిపప్పులు సరిపోతాయి. ఇది వారి జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు, శారీరక ఎదుగుదలకు కూడా సహాయపడుతుంది.
మీరు జిమ్‌కు వెళ్తుంటే రోజుకు 8-10 బాదం పప్పులు చాలు. బాదం పప్పులను నీటిలో నానబెట్టి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇలా చేస్తే బాదంలోని వేడి తగ్గుతుంది.
జీడిపప్పును ఎక్కువగా ఇష్టపడేవారు రోజుకు 5-6 వరకు తినొచ్చు. కానీ, రోజూ అంత మోతాదులో తినకపోవడమే మంచిది. రోజుకు 4-5 జీడిపప్పులు తింటే శరీరంలో కాల్షియం, మెగ్నీషియం లోపం తగ్గుతుంది.
ప్రతిరోజూ జీడిపప్పు, బాదం తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బాదంలోని విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరాన్ని ఫిట్‌గా ఉంచి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
కేవలం వారంరోజులు ఉప్పు తినకుంటే ఏమవుతుందో తెలుసా?
Sreeleela Fitness: శ్రీలీల బ్యూటీ సీక్రెట్ ఇదేనట
Blood Sugar: ఇదొక్కటి తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటుంది
Mangalsutra: 2గ్రాముల్లో చోకర్ మంగళసూత్రాలు కచ్చితంగా ట్రై చేయాల్సిందే