
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు పవన్ కల్యాణ్. అనతికాలంలోనే పవర్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన యాక్టింగ్, స్టైల్ తో కోట్లాది మంది
అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యి ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక తండ్రి, బాబాయిల అడుగు జాడల్లోనే నడుస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఆర్ ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ రేంజ్ కు ఎదిగిపోయిన రామ్ చరణ్ రీసెంట్ గా పెద్ది సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.ఈ సినిమా ఏకంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇదిలా ఉంటే మెగా హీరోలతో సినిమా అంటే ఏ హీరోయినైనా ఎగిరి గంతేస్తుంది. అలా పవన్ కల్యాణ్, రామ్ చరణ్ లతో కలిసి ఎంతో మంది హీరోయిన్లు నటించారు. కొందరు ముద్దుగుమ్మలైతే బాబాయి, అబ్బాయిలిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సమంత, కాజల్ అగర్వాల్, శ్రుతి హాసన్, తమన్నాలు ఈ ఇద్దరు మెగా హీరోలతో రొమాన్స్ చేశారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం ఒక సినిమాలో పవన్ కల్యాణ్ కు ప్రియురాలిగా, మరో సినిమాలో రామ్ చరణ్ కు తల్లిగా నటించింది. రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. మరి ఆమె ఎవరో తెలుసా?
పవన్ కల్యాణ్ కు ప్రియురాలిగా, రామ్ చరణ్ కు తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ శ్రియనే అని చెప్పవచ్చుపవన్ కల్యాణ్ హీరోగా నటించిన బాలు సినిమాలో హీరోయిన్ గా చేసింది శ్రియ. కరుణాకరణ్ తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంటుంది. అందులో రామ్ చరణ్‌కు తల్లిగా శ్రియా, తండ్రిగా అజయ్ దేవగణ్‌లు యాక్ట్ చేస్తారు. అలా రామ్ చరణ్‌కు తల్లిగా, పవన్ కు ప్రియురాలిగా నటించింది శ్రియా. టాలీవుడ్ లో ఇలా నటించిన ఏకైక హీరోయిన్ శ్రియనే అని చెప్పవచ్చు.
A post shared by Shriya Saran (@shriya_saran1109) A post shared by Shriya Saran (@shriya_saran1109) మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి