
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మరో అరుదైన, అత్యున్నత గౌరవం దక్కింది. టాలీవుడ్ సీనియర్ నటులు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad), మురళీ మోహన్ (Murali Mohan) లను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక...
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మరో అరుదైన, అత్యున్నత గౌరవం దక్కింది. టాలీవుడ్ సీనియర్ నటులు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad), మురళీ మోహన్ (Murali Mohan) లను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మరో అరుదైన, అత్యున్నత గౌరవం దక్కింది. టాలీవుడ్ సీనియర్ నటులు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad), మురళీ మోహన్ (Murali Mohan) లను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. కళా రంగానికి వారు చేసిన విశేష సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించిన విషయం తెల్సిందే. ఇక మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారాలను ప్రదానం చేశారు.
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తెలుగు నట హాస్యానికి సరికొత్త అర్థం చెప్పారు. ఎన్నో వైవిధ్యమైన, సందేశాత్మకమైన చిత్రాలతో దశాబ్దాలుగా నవ్వుల రేడుగా కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఆయన ప్రస్థానానికి ఈ పద్మశ్రీ మకుటాయమానంగా నిలిచింది. మరోవైపు సీనియర్ నటుడు మురళీ మోహన్ నటుడిగానే కాకుండా జయభేరి క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్నో క్లాసిక్ సినిమాలను నిర్మించి, పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. సినీ రంగానికే కాకుండా సామాజిక సేవలోనూ ఆయన ఎప్పుడూ ముందుంటారు.
ఈ ఇద్దరు నటులకు పద్మశ్రీ అవార్డు దక్కడంపై టాలీవుడ్ లో పండగ వాతావరణం నెలకొంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్ లకు సామాజిక మాధ్యమాల వేదికగా ఘనంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దశాబ్దాల పాటు తెలుగు సినీ రంగాన్ని తమ నటనతో, వ్యక్తిత్వంతో ఏలిన ఈ ఇద్దరు సీనియర్ నటులకు ఈ పురస్కారం దక్కడం సముచితమని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. ఇక వీరు కాకుండా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, స్టార్ నటుడు ఆర్. మాధవన్ తో పాటు క్రికెటర్ రోహిత్ శర్మ కూడా పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు.