
Padma Awards 2026 | ఇంటర్నెట్ డెస్క్: దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ‘పద్మ’ అవార్డుల (Padma awards 2026) రెండో విడత ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) మంగళవారం సాయంత్రం ఈ అవార్డులను ప్రదానం చేశారు. ప్రఖ్యాత మలయాళ పాత్రికేయుడు పి.నారాయణన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ పద్మవిభూషణ్ అందుకోగా.. సినీ రంగ ప్రముఖులు మమ్ముట్టి, అల్కా యాగ్నిక్తో పాటు ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మ భూషణ్ పురస్కారాలను అందుకున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి నేడు పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నవారిలో సినీ నటులు మాగంటి మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్ ఉన్నారు. అలాగే, వీరితో పాటు సినీనటుడు మాధవన్, క్రికెటర్ రోహిత్ శర్మ, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ పురస్కారాలను అందుకున్నారు.
దేశంలోని పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి భారత గణతంత్ర దినోత్సవం (Republic Day celebrations) వేళ కేంద్రం మొత్తం 131 మందికి పద్మ పురస్కారాలకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తొలి విడతలో 66 మందికి అందజేయగా.. మిగతా వారికి నేడు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, గజేంద్రసింగ్ షెకావత్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.