
Kachidi Fish Viral Video: అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్లో 25 కిలోల బరువున్న అరుదైన 'కచిడి' చేప మత్స్యకారుల వలకు చిక్కింది.
ఔషధాల తయారీలో ఉపయోగపడే ఈ చేపకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వేలంలో పాలకొల్లుకు చెందిన వ్యాపారి దీనిని రూ.2 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ అరుదైన చేపను చూసేందుకు హార్బర్ వద్ద స్థానికులు భారీగా తరలివచ్చారు.