
జగన్ (Jagan) కబంధ హస్తాల్లో వైసీపీ కాపు నేతలు ఇరుక్కున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) అన్నారు. అమరావతి (Amaravati)లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
వైసీపీ నేరస్థులను తయారు చేసే కర్మాగారం అని ఆరోపించారు. కూటమిలో చీలికల కోసం గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తోందన్నారు. చంద్రబాబు ( Chandrababu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రామలక్ష్మణుల్లా ఎల్లప్పుడూ కలిసే ఉంటారని, వారి బంధం విడదీయటం ఎవరితరం కాదని స్పష్టం చేశారు.