
పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్జె తొలిసారి భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. వచ్చే నెలలో ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగే టీ20 సిరీస్‌ల కోసం ప్రకటించిన భారత జట్టులో సూర్యాంశ్ చేరాడు.
స్పోర్ట్స్ డెస్క్: పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్జె తొలిసారి భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. వచ్చే నెలలో ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగే టీ20 సిరీస్‌ల కోసం ప్రకటించిన భారత జట్టులో సూర్యాంశ్ చేరాడు. హైదరాబాదీ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో అతడిని బీసీసీఐ ఎంపిక చేసింది. జూన్ 20న అఫ్గానిస్థాన్ తో జరిగిన మూడో వన్డే తర్వాత నితీశ్ రెడ్డి ఎడమ తొడ కండరాలలో నొప్పితో బాధపడ్డాడు. వైద్య పరీక్షల అనంతరం కొంతకాలం పునరావాసం పొందాలని బీసీసీఐ వైద్య బృందం సిఫార్సు చేసింది. దీంతో అతడు ఈ రెండు టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు.
ఇటీవల శ్రీలంకలో ముగిసిన ముక్కోణపు సిరీస్‌లో భారత-ఎ జట్టు తరఫున మంచి ప్రదర్శన చేసిన నేపథ్యంలో సూర్యాంశ్‌కు బీసీసీఐ నుంచి ఈ పిలుపు అందింది. మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసిన ఈ యువ ఆటగాడు.. ముక్కోణపు సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లలో 147 పరుగులు సాధించడంతో పాటు, 23 ఓవర్లు బౌలింగ్ చేసి బంతితో కూడా రాణించాడు.
అలానే సయ్యద్ ముస్తాక్ అలీ 2024-25లో ముంబై తరఫున లోయర్ మిడిల్ ఆర్డర్లో 251.92 స్ట్రైక్ రేట్‌తో 131 పరుగులు చేశాడు. అంతేకాక ఆ జట్టు తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. అలానే ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ తరఫున సూర్యాంశ్ ఆడాడు. ఈ సీజన్లో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 158 పరుగులతో స్ట్రైక్ రేట్ 175.56 గా నమోదైంది. లోయర్ ఆర్డర్లో వేగంగా పరుగులు రాబట్టే ఫినిషర్‌గా పంజాబ్ జట్టు ఇతనికి అవకాశాలు కల్పించింది
'ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరగబోయే టీ20 సిరీస్‌ల కోసం భారత జట్టులో నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో సూర్యాంశ్ షెడ్జెను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది' అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అలానే ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగే వన్డేల్లో కూడా హార్దిక్ పాండ్య స్థానంలో కూడా నితీశ్ కుమార్ రెడ్డి భర్తీ చేయాల్సి ఉంది. కానీ వన్డే మ్యాచులకు కూడా అందుకునే అవకాశం లేదని క్రీడా వర్గాల నుంచి సమాచారం. బీసీసీఐ రిహాబిలిటేషన్ సెంటర్ లో అతడ తన పునరావాసాన్ని పూర్తి చేయడానికి కనీసం నాలుగు వారాల సమయం పడుతుందని.. ఆ గడువు పొడిగించవచ్చే అవకాశం కూాడ ఉందని సమాచారం.
ఐపీఎల్లో భారీ ట్రేడ్.. ఢిల్లీకి పంత్, లఖ్‌నవూకు కుల్దీప్ యాదవ్
ప్లేయర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి.. బీసీసీఐకు గావస్కర్ సూచన