
బసవతారకం ఆసుపత్రి (Basavatarakam Hospital)ని ఎంతోమంది క్యాన్సర్ (Cancer) బాధితుల పట్ల దేవాలయంగా తీర్చిదిద్దారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు.
బసవతారకం ఆసుపత్రి రజతోత్సవ కార్యక్రమానికి చంద్రబాబు హాజరై మాట్లాడారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి ఎంతో మంది దాతలు సహకరించారని, ప్రభుత్వాలు, పార్టీలు అండగా నిలిచాయని తెలిపారు. క్యాన్సర్తో భార్య చనిపోయాక ఎన్టీఆర్ (NTR) ఎంతో బాధపడ్డారు. అలాంటి రోగులకు అండగా ఉండాలని కోరుకున్నారు. బసవతారకం ఆసుపత్రిని అప్పటి ప్రధాని వాజ్పేయి ( Vajpayee) ప్రారంభించారు. మధ్యలో అనేక సమస్యలు వచ్చినా బాలకృష్ణ (Balakrishna) సమర్థంగా నిర్వహించారు. ఆయన ఎంత బిజీగా ఉన్నా క్యాన్సర్ ఆసుపత్రిని తరచుగా సందర్శిస్తారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవలు అందిస్తున్నారు. ఇక్కడ ఏటా 8 వేల మందికి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక క్యాన్సర్ శిబిరాలు నిర్వహించారు. పేదవర్గాలకు ఈ ఆసుపత్రి నిజమైన గుండె ధైర్యంగా మారింది. దేశంలో క్యాన్సర్తో ఏటా 9 లక్షల మంది చనిపోతున్నారు. ఈ వ్యాధి బారిన పడితే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోతోంది. కొందరు వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇలాంటి ఆసుపత్రులు పెట్టాలి అని అన్నారు.