
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Rain Alert For Hyderabad: హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంా శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, చార్మినార్, ఉప్పల్, మల్లాపూర్, మాదాపూర్, ఆర్సి పురం, కూకట్పల్లి, మణికొండ, ఖాజాగూడ, శంషాబాద్, రాజేంద్రనగర్ దాదాపు 2 గంటల సేపు భారీ వర్షం కురిసింది.
ఆయా ప్రాంతాల్లో వర్షం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. పూర్తిగా ఆగకుండా తెల్లవార్లూ కురుస్తూనే ఉంది. వర్షం వల్ల ప్రాంతాల్లో చెట్లు నేలకొరగడంతో పాటు కరెంట్ తీగలపై పడటంతో చాలా ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి కరెంట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు విద్యుత్ శాఖ అధికారులు కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినపుడు ప్రజల ఫిర్యాదులకు స్పందించడం లేదు. క్షేత్రస్థాయిలో కొంత మంది అధికారులు దురుసుగా ప్రవర్తించడంతో పాటు స్థానికంగా ఉండే ఏఈ, ఏడీఈ రెస్పాన్స్ కావడం లేదనేది ప్రజలు చెబుతున్న మాట. స్పందించినా.. తీరిగ్గా స్పందిస్తున్నారు.
అత్యధికంగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో 12.7 సెంటిమీటర్ల వర్షం..
మరోవైపు శంషాబాద్, రాజేంద్రనగర్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, చంద్రాయణగుట్ట వైపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో 12.7 సెంటిమీటర్లు, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో 12.1 సెంటిమీటర్లు, మియాపూర్‌లో 11.3 సెంటిమీటర్లు, గచ్చిబౌలిలో 10.3 సెంటిమీటర్లు, బీహెచ్ఈఎల్లో 10 సెంటిమీటర్లు, రాజేంద్రనగర్‌లో 64 సెంటిమీటర్ల వర్షం పడింది.
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఊహించని రీతిలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తాయని..గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది వాతావరణశాఖ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.