జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షంలో ఏకాదశి తేదీ జూన్ 24వ తేదీ బుధవారం సాయంత్రం 6:13 గంటలకు నిర్జల ఏకాదశి తిథి ప్రారంభం కానుంది. ఆ తర్వాత మరుసటి రోజు జూన్ 25న గురువారం రాత్రి 8:10 గంటలకు ఈ తిథి ముగుస్తుంది.
ఉదయం తిథి ప్రకారం నిర్జల ఏకాదశి జూన్ 25వ తేదీ గురువారం నాడు జరుపుకుంటారు. జ్యేష్ఠ శుక్ల ఏకాదశి తిథి ప్రారంభం : జూన్ 24న బుధవారం సాయంత్రం 6:13 గంటలకు జ్యేష్ఠ శుక్ల ఏకాదశి ముగింపు: జూన్ 25 గురువారం రాత్రి 8:10 గంటలకు నిర్జల ఏకాదశి 2026: జూన్ 25, గురువారం
* నిర్జల ఏకాదశి వేళ తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. * ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశి తిథులలో నిర్జల ఏకాదశి చాలా కఠినమైనది. * ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించే వారు చుక్క నీరు కూడా తీసుకోకూడదు. * అయితే అనారోగ్యంతో ఉండే వ్యక్తులు ఉపవాస వేళ నీటిని, పండ్లను తీసుకోవచ్చని శాస్త్రాలలో పేర్కొనబడింది. * నిర్జల ఏకాదశి రోజున శ్రీ విష్ణుమూర్తి ఫోటో లేదా ప్రతిమను తాజా పువ్వులతో, తులసి మాలతో అలకరించి పూజించాలి. * పూజా సమయంలో పండ్లు సమర్పించి, తులసి మొక్కకు పూజ చేసి దీపారాధన చేయాలి.
తులసి మొక్క చుట్టూ 5 లేదా 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. అనంతరం ఏకాదశి కథను హారతి ఇవ్వాలి. ఈ రోజంతా ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపించాలి. అంతేకాదు నిర్జల ఏకాదశి వేళ ఉపవాస దీక్షను ఆచరించే వారు పగటిపూట నిద్రపోకూడదు. విష్ణుమూర్తిని స్మరించుకుంటూ రాత్రి భజన, కీర్తనలు కూడా చేయాలి. అనంతరం మరుసటి రోజు అంటే గురువారం ఉదయం బ్రహ్మముహుర్తంలో పూజలు చేసి ముందుగా అన్నం తినాలి. అప్పుడే ఉపవాస దీక్ష పూర్తవుతుందని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శ్రీ విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని చాలా మంది నమ్ముతారు.
ఈ ఏడాది నిర్జల ఏకాదశి వేళ అనేక శుభ యోగాలు ఏర్పడనున్నాయి. జూన్ 25న రవి, శివ, సిద్ధ యోగాలు ఏకకాలంలో ఏర్పడనున్నాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ యోగాల కలయిక అత్యంత శుభప్రదమైనది. ఈ ఏకాదశి గురువారం రోజున రావడం వల్ల, దీనికి మరింత విశిష్టత పెరగనుంది. హిందూ మతపరమైన విశ్వాసాల ప్రకారం, ఈ యోగాల సమయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం, మంత్రాలు పఠించడం, దానధర్మాలు చేయడం, శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవిని ఆరాధించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అయితే ఇదే రోజున భద్ర కాలం ఉదయం 7:08 గంటల నుంచి రాత్రి 8:09 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో భద్ర ‘పాతాళ లోకం’లో ఉంటుంది. దీనివల్ల దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి నిర్జల ఏకాదశి వేళ ఉపవాసం దీక్షను ఆచరించడం, పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు, శ్రీ మహా విష్ణువును ఆరాధించేందుకు ఎలాంటి ఆటంకాలు ఉండవని పండితులు చెబుతున్నారు.
గమనిక : ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. Read Latest Religion News and Telugu News
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు, పంచాంగం, ఆధ్యాత్మికంతో పాటు స్పెషల్ స్టోరీలు చేస్తుంటారు. జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనలు, పరిహారాల గురించి ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారాన్ని చేరవేస్తూ, గ్రహాల అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తుంటారు. ఇవి వీక్షకులకు ఎంతగానో సహాయపడతాయి. జర్నలిజంలో 10 ఏళ్లకు పైగా అనుభవంలో ప్రింట్, డిజిటల్ మీడియాలో పొలిటికల్, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక వార్తలను రాశారు. జ్యోతిష్యం విభాగంలో 8 వేలకు పైగా ఆర్టికల్స్, ఆరోగ్యం, బ్యూటీ, ట్రావెల్, స్పోర్ట్స్, పాలిటిక్స్, సెప్షల్ ఆర్టికల్స్ 7 వేలకుపైగా రాయడంతో పాటు, పొలిటికల్ సర్వేలు, ఫీల్డ్ సర్వే ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు. జ్యోతిష్య రచయితగా వెంకటేష్ పాఠకులకు కచ్చితమైన మరియు సరైన నివారణ చర్యలు, పరిహారాల సమాచారాన్ని అందిస్తారు. జ్యోతిష్య సమాచారం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అయినప్పటికీ, వృత్తి పరంగా జ్యోతిష్య సలహాలు నమ్మొద్దని గట్టిగా నొక్కి చెబుతారు. కేవలం అర్హత కలిగిన జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలని, అప్పుడే మీ వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందని పాఠకులకు నిరంతరం సలహా ఇస్తారు. వెంకటేష్ రాయలసీమ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. అలాగే పిజేఎస్ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. ఈ అర్హతలు 5Ws మరియు 1H(ఎవరు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా) తనకు జర్నలిజం చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తాయి. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా వెంకటేష్ రచనా శైలి కచ్చితత్వం, విశ్వసనీయత, నైతిక బాధ్యత, ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. తన ఆర్టికల్స్ పరిశోధన, అధ్యయనం చేసినవి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఇతర రంగాల నిపుణులు, అధికారిక సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ పాఠకులకు అర్థమయ్యేలా సులభంగా, వాడుక భాషలో అందిస్తారు. సమయం తెలుగులో చేరడానికి ముందు వన్ ఇండియాలో(05-08-2019 to 30-06-2022) సీనియర్ సబ్ ఎడిటర్‌గా హెల్త్, రిలేషన్షిప్, బ్యూటీ, ఫ్యాషన్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికం, హోమ్ రెమెడీస్, రెసిపీస్ ట్రావెల్ వంటి అంశాలను కవర్ చేశారు. లోకల్ యాప్‌లో కంటెంట్ మేనేజర్‌గా(01-03-2019 to 05-08-2019) ‘‘స్వయం ఉపాధి’’ ఐపిఎల్ లైవ్ ప్రాజెక్టు, పొలిటికల్ సర్వే, ఎలక్షన్ ఈవెంట్స్‌లో కూడా పని చేశారు. అక్కడ ప్రముఖ రాజకీయ విశ్లేషకులను సంప్రదించిన తర్వాతే కచ్చితమైన సమచారాన్ని అందించారు. ప్రజాశక్తిలో కాపీ ఎడిటర్‌గా(08-02-2016 నుంచి 22-02-2019) న్యూస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్ స్టోరీలను కూడా కవర్ చేశారు.... ఇంకా చదవండి