
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామంలో ఓ మొసలి కలకలం రేపింది. గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో మొసలి ప్రత్యక్షం కావడంతో స్థానిక రైతులు, గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మహబూబాబాద్ జిల్లా, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామంలో ఓ మొసలి కలకలం రేపింది. గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో మొసలి ప్రత్యక్షం కావడంతో స్థానిక రైతులు, గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అర్పణపల్లి శివారులోని వ్యవసాయ పొలాల్లో ఉన్న ఓ బావిలోకి వెళ్లిన రైతులకు లోపల పెద్ద మొసలి కనిపించింది. దీంతో అప్రమత్తమైన రైతులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
అయితే, అక్కడికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది మొసలిని సురక్షితంగా బయటకు తీసేందుకు, బంధించేందుకు వెనకడుగు వేశారు. అటవీ శాఖ సిబ్బంది సహాయం కోసం ఎదురుచూడకుండా, ప్రమాదం పొంచి ఉందనే ఉద్దేశంతో స్థానిక యువకులు, రైతులు స్వయంగా రంగంలోకి దిగారు. ఎంతో శ్రమించి, చాకచక్యంగా మొసలిని వలలో చిక్కేలా చేసి పైకి లాగారు. జనావాసాలు, వ్యవసాయ పొలాల వైపు ఇలాంటి వన్యప్రాణులు రావడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ అభివృద్ధిపై కీలక చర్చలు
కేటీఆర్ సినిమా డైలాగులు మానుకోవాలి.. ప్రజల కోణంలో మాట్లాడాలి: ఎంపీ చామల
Read Latest Telangana News And AP News And National News