
ప్రభుత్వాన్ని కోరిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఈనాడు, అమరావతి: ఆహార భద్రతా వ్యవస్థలో లోపాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రంలో కల్తీ పాలు, నకిలీ మసాలాలు, నాసిరకం ప్యాకేజ్డ్ ఫుడ్, కలుషిత తాగునీరు, అపరిశుభ్ర మాంసం అమ్మకాలపై జనతా వారధి కార్యక్రమానికి ఫిర్యాదులు, వినతులు వస్తుండడం ఆందోళన కలిగిస్తోందని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఆహార భద్రత అమలులో కీలకమైన ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరత తీవ్రంగా ఉండడంతో పర్యవేక్షణ కొరవడుతోంది. ఖాళీలు భర్తీ చేసి, జిల్లాకో మినీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేయాలి. ఆహార సంస్థలకు లైసెన్సులు తప్పనిసరి చేయాలి. హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం దుకాణాల్లో పరిశుభ్రతపై తనిఖీలు నిర్వహించాలి. అక్రమ వధశాలలను మూసివేయాలి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక ఆహార భద్రత తనిఖీలు చేపట్టాలి. ప్రజల ఫిర్యాదుల స్వీకరణకు 24×7 ఫుడ్ సేఫ్టీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలి’ అని ప్రభుత్వాన్ని మాధవ్ కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.