
తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగంపేట దగ్గర ప్రమాదవశాత్తూ టాటాఏస్ వాహనం బోల్తాపడి ముగ్గురు మృతిచెందగా.. 8మందికి తీవ్రగాయాలు అయ్యాయి.
తూర్పుగోదావరి: జిల్లాలో ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగంపేట దగ్గర ప్రమాదవశాత్తూ టాటాఏస్ వాహనం బోల్తాపడి ముగ్గురు మృతిచెందగా.. 8మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు హుటాహుటిన పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు తరలించారు.
కాగా, మృతులను బాబు, రాజు, కాకడ రాజుగా గుర్తించారు పోలీసులు. ప్రమాదానికి గురైన బాధితులను కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన వారిగా తెలిపారు. అయితే, టాటాఏస్ టైరు పగిలిపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం ఆధారంగా తెలుస్తోంది. వీరంతా బాపట్ల జిల్లా కొల్లూరుకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పవన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో.. పోలీసు విచారణకు దువ్వాడ శ్రీను సర్‌లో లోపాలు సరిదిద్దండి.. సీఈవోకు టీడీపీ లేఖ