
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున ప్లాస్టిక్ పైరోలిసిస్ ఆయిల్ తయారీ కంపెనీ దక్షిణ్ ఎనర్జీలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి.
అనకాపల్లి జిల్లా: పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున ప్లాస్టిక్ పైరోలిసిస్ ఆయిల్ తయారీ కంపెనీ దక్షిణ్ ఎనర్జీలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పలువురు కార్మికులు ఫ్యాక్టరీలోనే చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందినట్టు సమాచారం.
ఘటన గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పోలీసులూ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. కాగా, ప్రమాదం గురించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తూ.గో.జిల్లా రంగంపేట వద్ద ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి..
సర్లో లోపాలు సరిదిద్దండి.. సీఈవోకు టీడీపీ లేఖ