
ఇంటర్నెట్‌డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలోని ఓ కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది (Fire Accident). ఈ ఘటనలో పలువురు విద్యార్థులు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
కొందరు తమ ప్రాణాలను కాపాడుకొనేందుకు భవనం పైఅంతుస్తుల నుంచి కిందికి దూకారు. ఈ ప్రమాద దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
లఖ్‌నవూలోని అలీగంజ్ ప్రాంతంలోని మూడంతస్తుల భవనం కిందిభాగంలో తొలుత మంటలు చెలరేగాయి. తర్వాత పైఅంతస్తులో ఉన్న కోచింగ్ సెంటర్‌కు ఎగబాకాయి. భవనమంతా మంటల్లో చిక్కుకుపోవడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, లోపల ఎంతమంది చిక్కుపోయారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.