
హైదరాబాద్: టీజీ20 లీగ్ 2026 సీజన్ రెండో మ్యాచ్లో రంగారెడ్డి రైజర్స్ - నల్గొండ నైట్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన నల్గొండ జట్టు..
నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఆరో స్థానంలో వచ్చిన దివేశ్ సింగ్ (48; 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో హర్షవర్థన్ సింగ్ (40*; 20 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ రాహుల్ బుద్ధి (30), వరుణ్ గౌడ్ (26), పాట్కూరి నితీశ్ రెడ్డి (20) పరుగులు చేశారు. ఓపెనర్లు గౌరవ్ రెడ్డి (0), ప్రణవ్ సూర్యదేవర (7)తోపాటు అర్ఫాన్ అహ్మద్ (7) నిరాశపర్చారు. రంగారెడ్డి బౌలర్లలో పున్నయ్య 3, నితిన్ సాయి యాదవ్ 2, ఆర్యన్ చరియప్ప 2, తనయ్ త్యాగరాజన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మేజర్ లీగ్ క్రికెట్ (Major League Cricket)2026లో భాగంగా సియాటెల్ ఓర్కాస్తో జరిగిన మ్యాచ్లో లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ బ్యాటర్ రోవ్మన్ పావెల్ (Rovman Powell) ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు.