
ద్రౌపది ముర్ముపై ఆమిర్ ఖాన్ బయోపిక్ డాక్యుమెంటరీని నిర్మిస్తున్నారు. దీనిని స్వాతి చక్రవర్తి భత్కాల్ రూపొందిస్తున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) జీవన ప్రయాణం తెరకెక్కుతోంది.
ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ (Aamir Khan Productions) ఈ ప్రాజెక్ట్ ను చేపట్టింది. ఒడిషాలోని ఓ చిన్న గిరిజన గ్రామంలో జీవితాన్ని మొదలు పెట్టి... రాష్ట్రపతి భవన్కు చేరుకున్న ద్రౌపది ముర్ము జీవన గమనాన్ని ఈ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీనిలో చూపించబోతున్నారు. ముర్ము ఎదుర్కొన్న వ్యక్తిగత విషాదాలు, సాధించిన చారిత్రక విజయాలకు ఈ డాక్యుమెంటరీ సాక్షీభూతం కానుంది.
భారతదేశ ప్రధమ పౌరురాలిగా ఓ గిరిజన మహిళ ఎంపిక కావడం అనేది ద్రౌపది ముర్ముతోనే జరిగింది. జీవితంలో ఉన్నత శిఖరాలను ఆధిరోహించడానికి ఆమె చేసిన అవిరళ కృషిని ఇందులో చూపించబోతున్నారు. ఈ బయోపిక్ డాక్యుకు స్వాతి చక్రవర్తి బత్కాల్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి ముందు ఆమె ఆమిర్ ఖాన్ నిర్మించిన 'రుబరు రోష్నీ' డాక్యుమెంటరీ యాంథాలజీని రూపొందించారు. ద్రౌపది ముర్ముపై తీస్తున్న బయోపిక్ డాక్యూ షూటింగ్ ఓడిషాలోని ముర్ము జన్మస్థలంలో ఇప్పటికే మొదలైంది. ఆమె నివసించిన ప్రాంతాలలో చిత్రీకరణ జరపడంతో పాటు నాటకీయ సంఘటనలను స్థానిక కళాకారులతో చిత్రీకరించబోతున్నారు.ఈ డాక్యుమెంటరీ ఈ తరానికి ఎంతో స్ఫూర్తినిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
Swetha Menon: కీలుబొమ్మను కావాలనుకోవడం లేదు..