
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల పెంపు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘం (8th Pay Commission) సిఫార్సులు అమలుల్లోకి వస్తే ఉద్యోగుల జీతాలు భారీగా పెరుగుతాయి.
బేసిక్ శాలరీ నుంచి డియర్నెస్ అలవెన్స్ లెక్కల వరకు అన్నీ మారిపోతాయి.
అయితే, ఈ సిఫార్సుల అమలు ఆలస్యమైతే తమకు ఎంత అరియర్స్ లభిస్తుందనే ప్రశ్న ఉద్యోగుల మనస్సులో ఉంది. ఒకవేళ 8వ వేతన సంఘం అమలులో ఆలస్యం జరిగితే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్స్‌కు లక్షల రూపాయల అరియర్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
8వ వేతన సంఘం సిఫార్సుల అమలు ఆలస్యమైతే కేంద్ర ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా అరియర్స్ ప్రయోజనం అందుతుంది. 7వ వేతన సంఘం గడువు 2025 డిసెంబర్ 31తో ముగిసింది. ఆ తర్వాత 2026 జనవరి 1 నుంచి 8వ వేతన సంఘం అమలు చేయాలనే ప్లాన్ ఉంది. కానీ, కమిషన్ రిపోర్టు తయారీ, ప్రభుత్వ ఆమోదం పొందడానికి టైమ్ పట్టేలా కనిపిస్తోంది.
ఈ లేట్ కావడం వల్లే ఉద్యోగులకు అరియర్స్ రూపంలో భారీ లాభం కలగనుంది. ఇందులో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ (Fitment Factor) కీలక పాత్ర పోషిస్తుంది. దీని ఆధారంగానే కొత్త బేసిక్ శాలరీ ఎంత అనేది ఫిక్స్ అవుతుంది. ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.0 - 2.87 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
8వ వేతన సంఘం సిఫార్సులు లేట్ అయితే ఉద్యోగులకు అరియర్స్ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బులు అందుతాయి. ముఖ్యంగా లెవెల్ 15 నుంచి లెవెల్ 18 వరకు ఉన్న సీనియర్ అధికారులకు ఈ అరియర్స్ ఏకంగా రూ. 90 లక్షల కంటే ఎక్కువే వచ్చే అవకాశం ఉంది. లెవెల్-15 నుంచి లెవెల్-18 కేటగిరీలో ప్రత్యేక కార్యదర్శులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, జీజీ స్థాయి అధికారులు, క్యాబినెట్ సెక్రటరీ లాంటి సీనియర్ అధికారులు ఉంటారు. ఈ లెవెల్ అధికారుల ప్రస్తుత బేసిక్ శాలరీ రూ. 1,82,200 నుంచి రూ. 2,50,000 వరకు ఉంటుంది.
ఒకవేళ 8వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86 శాతంగా ఫిక్స్ అయితే, లెవెల్ 15 నుంచి 18 వరకు ఉన్న ఉద్యోగులకు లక్షల్లో అరియర్స్ వస్తాయి. 20 నెలల అరియర్స్ బేస్ చేసుకుని లెక్కిస్తే, ఈ అమౌంట్ గరిష్ఠంగా రూ. 93 లక్షల వరకు చేరుకుంటుంది. అయితే ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమేనని గుర్తుంచుకోవాలి. అరియర్స్ ఫైనల్ క్యాలిక్యులేషన్ అనేది పే కమిషన్ సిఫార్సులు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం, 8వ వేతన సంఘం అమలులోకి వచ్చే ఫైనల్ డేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
ఒకవేళ ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 2.0 బేస్‌తో లెక్కిస్తే, ఈ అరియర్స్ రూ. 36 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ఉండొచ్చు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే బేసిక్ శాలరీతో పాటు అరియర్స్ కూడా పెరుగుతాయి.
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఒక మల్టిప్లయర్. దీని ఆధారంగానే పే కమిషన్ కేంద్ర ఉద్యోగుల బేసిక్ శాలరీని లెక్కిస్తుంది. కొత్త పే కమిషన్ వచ్చినప్పుడు, పాత బేసిక్ శాలరీని ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌తో గుణించి కొత్త బేసిక్ శాలరీని డిసైడ్ చేస్తారు. ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరగగానే బేసిక్ శాలరీ, డీఏ, హెచ్ఆర్ఏ, అరియర్స్ అన్నీ ఆటోమేటిక్‌గా పెరిగిపోతాయి. 7వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57గా నిర్ణయించారు. ఇది 2016 సంవత్సరం నుంచి అమలులోకి వచ్చింది.